వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్లబ్‌హౌస్ యాప్‌లో ముస్లిం మహిళలు టార్గెట్: అసభ్యకరంగా ఛాటింగ్: స్వాతి మలివాల్ సీరియస్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సోషల్ మీడియాపై ముస్లిం మహిళలను టార్గెట్‌ అసభ్యకర్ వ్యాఖ్యలు చేయడం రోజురోజుకు తీవ్రతరమౌతోంది. ఇటీవలే బుల్లిబాయి..సుల్లీ డీల్స్‌ వ్యవహారం ఏ స్థాయిలో వివాదాస్పదమైందో.. ఇప్పుడదే తరహాలో క్లబ్ హౌస్ యాప్ ఛాటింగ్ దుమారం రేపుతోంది. క్లబ్‌హౌస్ యాప్ ఛాటింగ్‌లో ముస్లిం మహిళలను ఉద్దేశిస్తూ చేసిన అసభ్యకరమైన కామెంట్స్ క్రమంగా రాజకీయరంగును పులుముకొంటున్నాయి. ఈ ఛాటింగ్ అంశంపై ఢిల్లీ మహిళా కమిషన్ స్పందించింది. నిందితులను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేసింది.

క్లబ్ హౌస్ యాప్‌లో పోస్ట్ అయిన ఓ ఆడియో ఛాటింగ్‌ చేసిన వారిపై ఎఫ్ఐఆర్‌ను నమోదు చేయాలని ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాలి మలివాల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీస్ విభాగానికి నోటీసులను పంపించారు. బుల్లిబాయి సుల్లీ డీల్స్‌లో ముస్లిం మహిళలను ఫొటోలను అప్‌లోడ్ చేసి, వారిపై వేలంపాటలను నిర్వహించిన కేసులు విచారణ కొనసాగుతోంది. కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు.

Obscene comments against Muslim women on Clubhouse app, DCW issued a notice

విచారణ కొనసాగుతుండగానే ఇప్పుడు తాజా క్లబ్‌హౌస్ ఘటన చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. హిందువుల కంట ముస్లిం మహిళలు అందంగా ఉంటారంటూ కొందరు ఆడియో ఛాటింగ్‌ను పోస్ట్ చేశారు. దీనిపై కొందరు అసభ్య పదజాలంతో కామెంట్స్ పెట్టారు. దీన్ని ఢిల్లీ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. ఈ చాటింగ్ చేసిన వారిపై ఎఫ్ఐఆర్‌ను నమోదు చేయాలని స్వాతి మలివాల్.. ఢిల్లీ సైబర్ క్రైమ్ సెల్ పోలీసులకు లేఖ రాశారు.

ఈ కేసులో నిందితులుగా గుర్తించిన వివరాలను తమకు అందజేయాలని సూచించారు. ఎవరినీ అరెస్ట్ చేయలేకపోతే.. దానికి గల సంతృప్తికర కారణాలను వివరించలని స్వాతి మలివాల్ ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే విషయంపై పూర్తిస్థఆయి నివేదికను అందజేయాలని పేర్కొన్నారు. ఈ కేసుకు ఉన్న తీవ్రత, ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు.

బుల్లిబాయి-సుల్లీడీల్స్ కేసు విషయంలో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు సహా వేర్వేరు నగరాల నుంచి ఈ వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారు విచారణను ఎదుర్కొంటోన్నారు. తమ విచారణ సందర్భంగా నిందితులు నేరాన్ని అంగీకరించారని ముంబై పోలీసులు చెప్పారు. ఈ కేసులో మరిన్ని సాక్ష్యాధారాలను సేకరించాల్సి ఉందని అన్నారు. మరిన్ని అరెస్టులు సంభవించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

English summary
The Delhi Commission for Women (DCW) issued a notice to the Cyber Crime Cell of Delhi Police on Tuesday and demanded an FIR against persons making obscene comments against Muslim women on an app called ‘Clubhouse’.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X