లీవ్ పెట్టైనా సరే.. అక్టోబర్ లో ఈ ప్రకృతిఅందాలు చూసెయ్యండి!
అక్టోబర్ మాసం.. అప్పుడప్పుడే మొదలవుతున్న చలికాలం. ఈ మాసంలో భారతదేశంలో ఆహ్లాదకరమైన వాతావరణం, మనసును హత్తుకునే ప్రకృతిదృశ్యాలు అనేకం కనిపించే సుందర పర్యాటకప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా అక్టోబర్లో ప్రయాణం చేయాలనుకుంటే ఏ ప్రదేశాలు అందంగా, ఆకర్షణీయంగా, మనసుకు ఆహ్లాదాన్ని నింపేలా ఉంటాయి. లీవ్ పెట్టయినా చూడాల్సిన సుందర ప్రాంతాలేంటి అనేది ప్రస్తుతం తెలుసుకుందాం. అక్టోబర్లో ఆహ్లాదాన్ని ఇచ్చే టాప్ 5సుందర పర్యాటక ప్రాంతాలకు వెళ్ళొద్దాం.
కేరళ
అక్టోబర్ మాసంలో కేరళ సర్వాంగ సుందరంగా కనిపిస్తుంది. అక్కడి ప్రకృతి దృశ్యం మనసును దోచుకుంటుంది. వర్షాకాలం ముగిసిన తర్వాత కేరళ ప్రకృతి అందాలు ప్రాణం పోసుకుంటాయి. మున్నార్ ప్రాంతం మరియు వయనాడ్ వంటి కొండ ప్రాంతాలు, వాటి రంగురంగుల వృక్షజాలం కారణంగా అక్కడికి వెళ్ళిన వారిని ఇట్టే ఆకట్టుకుంటాయి. ప్రకృతి అందాలతో, చల్లనైన వాతావరణంతో కేరళ అక్కడికి వెళ్ళిన వారిని కట్టిపడేస్తుంది.

గోవా
అక్టోబర్ మాసంలో గోవా అద్భుతంగా తోస్తుంది. అక్టోబర్ మాసంలో ఉష్ణోగ్రతలు సాధారణంగా, తక్కువ తేమతో ఆహ్లాదకరంగా ఉండడం వల్ల అక్టోబర్ మాసంలో గోవాను చూడడానికి వెళ్లే పర్యాటకులు అక్కడ ఎంజాయ్ చేయడానికి వీలుంటుంది. ఈ మాసంలో గోవా బీచ్ సందర్శించడానికి చాలామంది పర్యాటకులు వస్తారు.
కాశ్మీర్
అక్టోబర్ మాసంలో సందర్శించదగిన పర్యాటక ప్రాంతాలలో కాశ్మీర్ నిస్సందేహంగా ఒకటి. అద్భుతమైన లోయలతో, పర్వతాలతో ఉండే కాశ్మీర్ ఇప్పుడిప్పుడే మంచు దుప్పటి ని పరుచుకుంటూ చూపరులకు కనువిందు చేస్తుంది. అక్టోబర్ మాసంలో కాశ్మీర్ అందాలు, అక్కడి సరస్సులు, అక్కడి వృక్ష సంపద, వాతావరణం చూపరుల మనసులను దోచేస్తుంది.
ఉదయపూర్
రాజస్థాన్లోని ఉదయపూర్ అద్భుతమైన కోటలు, రాజభవనాలతో అక్టోబర్ మాసంలో చాలా ఆహ్లాదభరితంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న సరస్సులు, ఇక్కడి ప్రకృతి సౌందర్యం ఈ సీజన్ లో ప్రతి ఒక్కరి మనసులను కట్టేస్తుంది. ఉదయపూర్ నగరం రాచరిక సౌందర్యానికి ప్రతీకగా నిలుస్తూ గొప్ప సాంస్కృతిక వారసత్వంతో ఎక్కడికి వెళ్లినా వారికి అద్భుతంగా తోస్తుంది.
రిషికేశ్
అక్టోబర్ మాసంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రిషికేశ్ కూడా సుందర పర్యాటక ప్రాంతంగా కనువిందు చేస్తుంది. గంగా నది వెంట ప్రపంచ యోగ రాజధానిగా చెప్పబడే రిషికేష్ సాహస యాత్ర చేయాలనుకునే వారికి ప్లస్ గా మారుతుంది. రిషికేశ్ లో ఉన్న ప్రకృతి దృశ్యాలు సుందరమైన కొండలు, లోయలు, జాలువారే జలపాతాలు ఈ మాసంలో ఇక్కడికి వచ్చిన పర్యాటకులను ఆకర్షిస్తాయి.












Click it and Unblock the Notifications