బెయిల్ కోసం వస్తే..: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పోలీసు అధికారిణి
భువనేశ్వర్: లంచం తీసుకుంటూ మహోస్మిత పండా అనే ఒడిశాకు చెందిన మహిళా పోలీసు అధికారిణి విజిలెన్స్ అధికారులకు చిక్కింది. బాధితుడి నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా ఆమెను కటక్ విజిలెన్స్ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఓ కేసులో బాధితుడు సుబేందు దాస్.. బెయిల్ కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు. ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో మహోస్మిత .. పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. బెయిల్ కోసం క్లియరెన్స్ ఇవ్వాలంటూ సుబేందు.. పోలీసు ఆఫీసర్‌ను ఆశ్రయించాడు.

అయితే ఆ ఆఫీసర్ బాధితుడి నుంచి డబ్బు డిమాండ్ చేసింది. దీంతో ఈ విషయాన్ని అతను విజిలెన్స్ అధికారులకు తెలియజేశాడు. ఆ తర్వాత పక్కా ప్రణాళికతో కెమికల్ కోటెడ్ కరెన్సీ నోట్లను పోలీస్ స్టేషన్ ఆవరణలో బాధితుడు ఆ ఆఫీసర్‌కు అందజేశాడు. ఆ సమయంలోనే విజిలెన్స్ అధికారులు ఆమెను పట్టుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications