ముస్లిం మహిళలకు ఎంతో న్యాయం చేశాం- ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవన సముదాయం ఇవ్వాళ్టి నుంచి మనుగడలోకి రానుంది. వినాయకచవితి పండగను పురస్కరించుకుని ఈ భవాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇంకొద్దిసేపట్లో లాంఛనంగా అందులో అడుగుపెట్టనున్నారు సభ్యులు.

ఈ సందర్భంగా పాత పార్లమెంట్‌లో కేంద్రం వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటుచేసింది. సెంట్రల్ హాల్‌లో ఈ భేటీ ఏర్పాటైంది. స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌కర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, ప్రతిపక్ష నేతలు అధిర్ రంజన్ చౌదరి, మల్లికార్జున ఖర్గే.. వేదికపై ఆసీనులయ్యారు.

Old Parliament building should be known as Samvidhan Sadan, says PM Modi

ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. పాత పార్లమెంట్ భవనంలో తమ ప్రభుత్వ హయాంలో ఆమోదం పొందిన కీలక బిల్లుల గురించి ప్రస్తావించారు. ఈ పార్లమెంట్‌‌లో నిర్వహించిన సమావేశాల్లో దేశవ్యాప్తంగా లక్షలాదిమంది ముస్లిం మహిళలకు న్యాయం చేశామని అన్నారు. ట్రిపుల్‌ తలాక్ రద్దు చట్టం ఇక్కడే ఆమోదం పొందిందని గుర్తు చేశారు.

జమ్మూ కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి హోదాను కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేసుకోగలిగామని పేర్కొన్నారు. ట్రాన్స్‌జెండర్లకు న్యాయం చేయడానికి, దివ్యాంగులకు బంగారంలాంటి భవిష్యత్తుకు భరోసానిచ్చే చట్టాలను పాత పార్లమెంట్ సమావేశంలో ఆమోదింపజేసుకున్నామని వ్యాఖ్యానించారు.

ఇలా ఎన్నో చారిత్రాత్మక బిల్లులకు ఆమోదం లభించిన పాత పార్లమెంట్ భవనం గౌరవం ఎప్పటికీ దిగజారకూడదని మోదీ పేర్కొన్నారు. దీనిని సంవిధాన్ సదన్ అని పిలవాలని విజ్ఞప్తి చేశారు. భావి తరాలకు ఈ భవనాన్ని ఓ బహుమతిగా అందింద్దామని, మహనీయుల జ్ఞాపకాలను చిరస్మరణీయం చేద్దామని అన్నారు.

Old Parliament building should be known as Samvidhan Sadan, says PM Modi

కొత్త పార్లమెంట్ భవనంలో సరికొత్త భవిష్యత్‌కు నాంది పలుకబోతోన్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాల సరసన చేర్చాలనే సత్సంకల్పంతో కొత్త పార్లమెంట్ భవనంలో అడుగుపెడదామని పిలుపునిచ్చారు. ఉజ్వల భవిష్యత్ కోసం సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు మోదీ.

రాజకీయ ప్రయోజనాల గురించి ఆలోచించడానికే పరిమితం కాకూడదని, విజ్ఞానాన్ని పెంపొందించుకునేలా, సరికొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టేలా కొత్త పార్లమెంట్‌లో ఉమ్మడిగా నిర్ణయాలను తీసుకుందామని మోదీ విజ్ఞప్తి చేశారు. చంద్రయాన్ 3 విజయవంతమైన తరువాత యువత శాస్త్ర, సాంకేతిక రంగాల వైపు దృష్టి సారించిందని, వారికి మరింత ప్రోత్సహిద్దామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+