వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒమిక్రాన్ వ్యాప్తి టెన్షన్: 49కి చేరుకున్న కేసుల సంఖ్య, ఢిల్లీ, రాజస్థాన్ లలో కొత్త కేసులు!!

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ కేసులతో భారత్ ప్రజలకు కొత్త భయం పట్టుకుంది. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందే వేరియంట్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పదేపదే హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కరోనా పై కఠిన ఆంక్షలు విధించాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.

 దక్షిణాఫ్రికా నుండి ఢిల్లీ వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్

దక్షిణాఫ్రికా నుండి ఢిల్లీ వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్


ఇదిలా ఉంటే తాజాగా ఢిల్లీ మరియు రాజస్థాన్‌లలో కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేరియంట్ యొక్క కొత్త కేసులు నమోదవడంతో, దేశంలో కొత్త ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 49కి చేరుకుంది. ఇటీవల దక్షిణాఫ్రికా నుండి ఢిల్లీకి తిరిగి వచ్చిన గుజరాత్‌కు చెందిన 42 ఏళ్ల వ్యక్తికి కరోనావైరస్ యొక్క ఓమిక్రాన్ వేరియంట్‌కు పాజిటివ్ గా పరీక్షించబడ్డారు. డిసెంబరు 3న దక్షిణాఫ్రికా నుండి కెన్యా మరియు అబుదాబి మీదుగా ఢిల్లీకి వచ్చినప్పుడు ఆ వ్యక్తికి మొదటిసారిగా కరోనవైరస్ నెగిటివ్ అని తేలింది. డిసెంబర్ 4న అతని రెండవ పరీక్షలో కూడా, ఆ వ్యక్తికి కోవిడ్ నెగిటివ్ అని తేలింది, ఆ తర్వాత అతను ఆసుపత్రిలో ఐసోలేషన్ లో ఉన్నాడు. డిసెంబరు 8న అతనికి కోవిడ్‌తో కూడిన ఒమిక్రాన్ వేరియంట్‌తో పాజిటివ్‌గా తేలిందని అధికారులు తెలిపారు.

మహారాష్ట్రలోనూ కొత్తగా రెండు ఒమిక్రాన్ కేసులు

మహారాష్ట్రలోనూ కొత్తగా రెండు ఒమిక్రాన్ కేసులు

జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం అతని నమూనా పంపబడిందని, ప్రస్తుతం, ఆ వ్యక్తి హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నాడని వెల్లడించారు. అతని బంధువులు మరియు అతని నలుగురు సహ ప్రయాణీకులు కోవిడ్‌కు ప్రతికూలంగా పరీక్షించబడ్డారని చెబుతున్నారు.సోమవారం నాడు మహారాష్ట్ర కూడా ఒమిక్రాన్ వేరియంట్ యొక్క రెండు కొత్త కేసులను నివేదించింది, ఇద్దరు రోగులకు దుబాయ్ ప్రయాణ చరిత్ర ఉంది. ఒమిక్రాన్, కొత్త కోవిడ్ వేరియంట్ అత్యధికంగా వ్యాప్తి చెందుతుందని తెలుస్తుంది . ఇప్పుడు ఆరు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నివేదించబడ్డాయి.

ఇప్పటివరకు ఆరు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు .. లెక్కలు ఇవే

ఇప్పటివరకు ఆరు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు .. లెక్కలు ఇవే

ఇప్పటివరకూ మహారాష్ట్రలో 20 కేసులు, రాజస్థాన్ రాష్ట్రంలో తొమ్మిది కేసులు, కర్ణాటక రాష్ట్రంలో మూడు కేసులు, గుజరాత్ రాష్ట్రంలో నాలుగు కేసులు, కేరళ రాష్ట్రంలో ఒక కేసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కేసు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలు అయిన ఢిల్లీలో ఆరు కేసులు, చండీగఢ్ లో ఒక కేసు నమోదయినట్లు గా లెక్కలు చెబుతున్నాయి. ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని పదేపదే హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో కోవిడ్-సంబంధిత ప్రోటోకాల్‌లను కచ్చితంగా పాటించాలని, అలసత్వం వహించవద్దని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఇక వ్యాక్సినేషన్ కూడా ఆలస్యం చేయవద్దని, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాక్సినేషన్ తీసుకోవాలని సూచిస్తుంది.

ఒమిక్రాన్ వేరియంట్ పై ప్రపంచ వ్యాప్తంగా అధ్యయనాలు

ఒమిక్రాన్ వేరియంట్ పై ప్రపంచ వ్యాప్తంగా అధ్యయనాలు

దక్షిణాఫ్రికాలో మొదట కనుగొనబడిన ఒమిక్రాన్ వేరియంట్, ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు వ్యాపించింది, ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న యూకే లో ఒక మరణం నివేదించబడింది. ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఎంత ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది? ఇప్పటికే ఉన్న టీకాలు దానికి వ్యతిరేకంగా ఎంత ప్రభావవంతంగా ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా అధ్యయనాలు జరుగుతున్నాయి. ఈ వేరియంట్లో డేంజరస్ మ్యూటేషన్స్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈ వేరియంట్ పై ఆందోళన కొనసాగుతోంది.

కరోనా కేసులు తగ్గుతున్నా, ఒమిక్రాన్ దెబ్బకు భయం

కరోనా కేసులు తగ్గుతున్నా, ఒమిక్రాన్ దెబ్బకు భయం


ఇదిలా ఉంటే భారతదేశం యొక్క కరోనా కేసుల సంఖ్య మంగళవారం నాడు 3,47,06,344 కు పెరిగింది. ఒక రోజులో 5,784 మంది కరోనా మహమ్మారి కి పాజిటివ్ పరీక్షించారు. అయితే యాక్టివ్ కేసుల సంఖ్య 88,993 కు తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా చూపించింది. ఏది ఏమైనా కరోనా కేసులు తగ్గుతున్నా ఇప్పుడు ఒమిక్రాన్ భయం మాత్రం వేధిస్తుంది.

English summary
Omicron variant new case was registered in the national capital delhi. Delhi confirmed total 6 cases till now, omicron variant spread in 6 states and present cases has reached 49, new cases in Delhi and Rajasthan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X