Omicron Virus : ఢిల్లీలో ఓమిక్రాన్ కల్లోలం-రెండ్రోజులుగా 84 శాతం శాంపిల్స్ లో వైరస్ ఆనవాళ్లు
ఢిల్లీలో ఓమిక్రాన్ వైరస్ కల్లోలం రేపుతోంది. ఇప్పటికే ఢిల్లీలో ఓమిక్రాన్ వైరస్ కేసులతో పాటు సాధారణ వైరస్ కేసులు కూడా పెరుగుతున్నాయి. అయితే ఇందులో అత్యధిక కేసులు ఓమిక్రాన్ వైరస్ సోకినవే ఉండటం అధికారుల్ని కలవరపెడుతోంది. గత రెండు రోజులుగా పరీక్షించిన కోవిడ్ శాంపిల్స్ లో 84 శాతం ఓమిక్రాన్ వైరస్ సోకినవిగా గుర్తించారు.
గత ఏడాది డిసెంబర్ 30, 31 తేదీల్లో సేకరించిన కోవిడ్ 19 శాంపిల్స్ కు జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు నిర్వహించగా.. ఇందులో 84 శాతం ఓమిక్రాన్ వైరస్ విగా తేలాయని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. దీంతో ఢిల్లీలో ఓమిక్రాన్ కల్లోలం ఏ స్ధాయిలో ఉందో అర్ధమవుతోంది. అయితే ఓమిక్రాన్ వైరస్ కేసుల్ని తట్టుకునేందుకు ప్రస్తుతం ఢిల్లీ ఆస్పత్రుల్లో అవసరమైన సిబ్బంది, డాక్టర్లు అందుబాటులో ఉన్నారని ఆరోగ్యమంత్రి జైన్ వెల్లడించారు.

ఇప్పటికే ఢిల్లీలో భారీ ఎత్తున ఓమిక్రాన్ వ్యాపించినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఓమిక్రాన్ వైరస్ వేగంగా వ్యాప్తిచెందుతున్న నగరాల్లో సైతం ఢిల్లీ రెండో స్ధానంలో ఉంది. ఓమిక్రాన్ వైరస్ సేకిన రాష్ట్రాల వారీగా చూస్తే మొదటిస్ధానంలో మహారాష్ట్ర ఉండగా.. ఢిల్లీ రెండో స్ధానంలో ఉంది. మహారాష్ట్రలో ఓమిక్రాన్ వైరస్ కేసులు 510 ఉండగా.. ఢిల్లీలో 351 ఉన్నాయి ఢిల్లీలో ప్రతీ రోజూ నమోదవుతున్న కేసులు ఓ ఎత్తయితే ఇందులో ఓమిక్రాన్ వైరస్ కేసులు మరో ఎత్తుగా మారాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెరుగుతోంది.
ప్రస్తుతం ఢిల్లీలో రాత్రిపూట కర్ఫూ మాత్రమే కొనసాగుతోంది. పగలు ఆంక్షలు మాత్రం ఉన్నాయి. నానాటికీ పెరిగిపోతున్న ఓమిక్రాన్, కరోనా కేసుల దృష్టా లాక్ డౌన్ లు పెట్టే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ముఖ్యంగా వేగంగా విస్తరిస్తున్న ఓమిక్రాన్ వైరస్ ప్రభావాన్ని తట్టుకోవాలంటే లాక్ డౌన్ లు తప్పని సరిగా కేజ్రివాల్ సర్కార్ భావిస్తోంది. అయితే దీనిపై వెంటనే నిర్ణయం తీసుకునేందుకు మాత్రం జంకుతోంది. గతంలో లాక్ డౌన్ ల సందర్భంగా తలెత్తిన పరిస్ధితుల్ని దృష్టిలో ఉఁచుకుని కేజ్రివాల్ సర్కార్ ఆచితూచి వ్యవహరిస్తోంది.












Click it and Unblock the Notifications