'ఆపరేషన్ సింధూర్' విజయాన్ని తేటతెల్లం చేసిన ఉపగ్రహ చిత్రాలు!

Operation Sindoor: 'ఆపరేషన్ సింధూర్' సమయంలో పాకిస్థాన్ సైనిక వైఫల్యం, భారత విజయాన్ని చాటిచెప్పే ప్రత్యేకమైన ఉపగ్రహ చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. తమ యుద్ధనౌకలను కరాచీలోని వాణిజ్య టెర్మినల్స్‌కు తరలించడం, అలాగే ఇరాన్ సరిహద్దుల వద్ద దాక్కోవడం పాకిస్థాన్ ఈ పోరాటంలో ఓటమిని అంగీకరించిందని స్పష్టంగా రుజువు చేస్తున్నాయి. ఈ చిత్రాలు చరిత్రలో భాగం కావడంతో పాటు భవిష్యత్తులో కూడా భారత్ తన రక్షణ సంసిద్ధతను మరింత బలోపేతం చేసుకోవాలనే సందేశాన్ని కూడా ఇస్తున్నాయి.

మే 6, 7 రాత్రి భారత సైన్యం పాకిస్తాన్, పీఓకేలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై దాడులు నిర్వహించింది. ఈ దాడుల తర్వాత భారత్ తన లక్ష్యం పూర్తయిందని ఇస్లామాబాద్‌లోని డీజీఎంఓకు తెలియజేసింది. అయితే పాకిస్థాన్ ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరించింది. కానీ కరాచీ, గ్వాదర్ ఓడరేవుల ఉపగ్రహ చిత్రాలు పాకిస్తాన్ నౌకాదళం కేవలం రక్షణ వైఖరిని మాత్రమే తీసుకుందని స్పష్టం చేస్తున్నాయి.

Operation Sindoor Victory Exposed Satellite Images Reveal Pakistan Navy Retreat

పాకిస్థాన్ యుద్ధనౌకలు వాణిజ్య ఓడరేవుల్లో ఆశ్రయం
దాడులు ఉద్ధృతంగా జరుగుతున్న సమయంలో పాకిస్థాన్ నౌకాదళ యుద్ధనౌకలను కరాచీలోని నావల్ షిప్‪యార్డ్ నుంచి వాణిజ్య టెర్మినల్స్‌కు తరలించారు. ఇది ఉపగ్రహ చిత్రాలలో స్పష్టంగా కనిపిస్తుంది. అదే సమయంలో కొన్ని యుద్ధనౌకలు గ్వాదర్ వెస్ట్రన్ పోర్టులో ఆశ్రయం తీసుకున్నాయి. గ్వాదర్ పోర్ట్ ఇరాన్ సరిహద్దుకు కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ యుద్ధ నౌకలు తూర్పు దిశగా భారత్ వైపు రాకుండా, పశ్చిమ దిశలో దాక్కున్నాయి.

అగ్రశ్రేణి సైనిక నిపుణుల ప్రశ్నలు
దక్షిణ నౌకాదళ కమాండ్ మాజీ కమాండర్-ఇన్-చీఫ్ రిటైర్డ్ వైస్ అడ్మిరల్ ఎస్.సి. సురేష్ బంగారా మాట్లాడుతూ.. "భారత్ మే 7న ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన తర్వాత పాకిస్తాన్ త్రివిధ దళాలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. కానీ, యుద్ధనౌకలు పోర్టులలోనే కనిపించడం వాటి తక్కువ సంసిద్ధతను తెలియజేస్తుంది." అని అన్నారు. పౌర విమానాలకు దగ్గరగా సైనిక విమానాలను నడపడం ద్వారా పాకిస్తాన్ తన పౌర వనరులను బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉందని కూడా ఇది సూచిస్తుందని బంగారా అన్నారు. తమ యుద్ధనౌకలను క్షిపణి దాడుల నుంచి రక్షించుకోవడానికి వాణిజ్య ఓడరేవుల్లో నిలపడం, ఆ దేశ బలహీనతను చూపిందని ఆయన అన్నారు.

ఇరాన్ సరిహద్దుల వద్ద ఆశ్రయం
'ఆపరేషన్ సింధూర్'కు 6 నెలల ముందు పాకిస్థాన్ తన 'స్వదేశీ P282 షిప్-లాంచ్ బాలిస్టిక్ మిసైల్‌'ను పరీక్షించినట్లు ప్రచారం చేసుకుంది. దీని పరిధి 350 కిలోమీటర్లని పేర్కొంది. అయితే, మే 2025లో ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైనప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. అధిక రిజల్యూషన్ గల చిత్రాలు పాకిస్తాన్‌కు చెందిన సగం జుల్ఫికార్-క్లాస్ ఫ్రిగేట్లు ఇరాన్ సరిహద్దులకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్వాదర్‌లో నిలిచి ఉన్నట్లు చూపించాయి.

చైనా-పాకిస్థాన్ ఆర్థిక కారిడార్‌లో ముఖ్యమైన గ్వాదర్ పోర్ట్, ఆపరేషన్ సింధూర్ సమయంలో తాత్కాలిక నౌకాదళ ఆశ్రయంగా మారింది. మే 10 నాటికి దీని కంటైనర్ నిల్వ ప్రాంతాలు ఖాళీగా ఉన్నప్పటికీ, డాక్‌లో సైనిక నౌకలు నిండిపోయి ఉన్నాయి. ఇందులో రెండు జుల్ఫికార్-క్లాస్ ఫ్రిగేట్లు, రెండు తుగ్రిల్-క్లాస్ ఫ్రిగేట్లు, ఒక అమెరికా నిర్మిత ఒలివర్ హజార్డ్ పెర్రీ-క్లాస్ ఫ్రిగేట్, రెండు సముద్ర గస్తీ నౌకలు ఉన్నాయి.

భారత బలం.. పాక్ ఒత్తిడి
జియో-ఇంటెలిజెన్స్ పరిశోధకుడు డెమియన్ సైమన్ మాట్లాడుతూ.. 'ఆపరేషన్ సింధూర్' సమయంలో భారత్ తన తొలి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను అరేబియా సముద్రంలో మోహరించింది. దీనితో పాకిస్తాన్ పై ఒత్తిడి పెరిగింది. భారత్ కరాచీపై దాడికి సిద్ధమవుతుందని పాకిస్తాన్ భయపడి, తన నౌకాదళాన్ని వాణిజ్య డాక్‌లకు తరలించిందని ఆయన అన్నారు.

రిటైర్డ్ వైస్ అడ్మిరల్ బంగారా ఈ పరిణామాలను విశ్లేషిస్తూ.. పాకిస్తాన్ నౌకాదళం భారత సైన్యానికి వ్యతిరేకంగా ఎలాంటి పాత్ర పోషించలేదని అన్నారు. భారత్ తన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిందని, అవసరమైతే పాకిస్తాన్‌లోని సముద్ర వనరులను కూడా నాశనం చేయడానికి సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. 'ఆపరేషన్ సింధూర్' కేవలం విరామం తీసుకుందని, యుద్ధం ఆగలేదని ఆయన గుర్తుచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+