మోడీ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం ? విపక్ష కూటమి ఇండియా ప్లాన్ ?

మణిపూర్ మంటలు పార్లమెంట్ ను కుదిపేస్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమై నాలుగు రోజులు గడుస్తున్నా కేంద్రం మణిపూర్ ఘటనలపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడం, ముఖ్యంగా ప్రధాని మోడీ మౌనంగా ఉండిపోవడం విపక్షాలకు వరంగా మారింది. దీంతో విపక్షాలు వరుస నిరసనలతో పార్లమెంట్ కార్యకలాపాల్ని అడ్డుకుంటున్నాయి. కేంద్రం చర్చకు సిద్ధంగా ఉందని నిన్న హోంమంత్రి అమిత్ షా ప్రకటించినా విపక్షాలు శాంతించలేదు.

మణిపూర్ ఘటనలపై కేంద్రం తీరుకు నిరసనగా నిన్న రాత్రంతా పార్లమెంట్ ప్రాంగణంలోనే ఉండి నిరసనలు కొనసాగించిన విపక్ష ఇండియా కూటమి పార్టీల ఎంపీలు.. ఇవాళ కూడా పార్లమెంట్ ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి కొనసాగింపుగా కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీలు వ్యూహం సిద్దం చేసుకుంటున్నాయి. త్వరలో దీనిపై క్లారిటీ ఇవ్వబోతున్నాయి.

modi17

మణిపూర్‌లో జరుగుతున్న జాతి హింసపై చర్చించేందుకు ఇవాళ రూల్ 267 కింద 50 మంది ఎంపీలు ఇచ్చిన నోటీసులను చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ ఎట్టకేలకు ఆమోదించిన వెంటనే రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. లోక్‌సభ కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. చర్చ ప్రారంభమయ్యేలోపు ఉభయ సభల్లో సమగ్ర ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు తమ డిమాండ్‌పై పట్టుబట్టని పక్షంలో 267వ నిబంధన కింద మణిపూర్‌పై నేడు రాజ్యసభలో చర్చ జరగనుంది.

రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధంకర్ తన పదవీ కాలంలో ఇప్పటివరకు రూల్ 267 కింద ఎటువంటి తీర్మానాన్ని అనుమతించలేదు. రూల్ 267 కింద రాజ్యసభలో చర్చ సందర్భంగా మిగతా కార్యకలాపాలు పక్కనబెట్టాలని విపక్షాలు కోరుతున్నాయి. అలాగే ఎటువంటి సమయ పరిమితి లేకుండా ఎంపీలు మణిపూర్ అంశంపై మాట్లాడటానికి అనుమతించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+