రాజ్యసభలో విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గేకు కరోనా-పాదయాత్రలో సోకడంలో కాంగ్రెస్ శ్రేణుల్లో భయాలు
రాజ్యసభలో విపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గేకు కరోనా సోకింది. తాజాగా పార్లమెంటు సమావేశాల్లో కూడా పాల్గొన్న ఖర్గే... అనంతరం కాంగ్రెస్ నిర్వహిస్తున్న ప్రచారాల్లో కూడా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ప్రస్తుతం హోం ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు.
కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే ఇప్పటికే కోవిడ్ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే బూస్టర్ డోస్ తీసుకునేందుకు మాత్రం ఇంకా సమయం ఉంది. దీంతో ఆయన కాంగ్రెస్ నిర్వహించిన పాదయాత్రలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అక్కడ ఆయనకు కోవిడ్ సోకింది. అయితే కోవిడ్ లక్షణాలు మాత్రం లేవు. దీంతో ఆయన్ను ముందుజాగ్రత్తగా ఐసోలేషన్ కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగ్గానే ఉంది.

కర్నాటకలో బీజేపీ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న పాదయాత్రలో ఆయన తాజాగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వల్ప ఆస్వస్ధత కనిపించడంతో కోవిడ్ పరీక్ష చేయించుకున్నారు. దీంతో ఆయనకు కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం కీలక నేతగా ఉన్న మల్లిఖార్జున ఖర్గే తాజాగా రాజ్యసభలో విపక్ష నేతగా కూడా ప్రమోట్ అయ్యారు. గతంలో లోక్ సభలోనూ కాంగ్రెస్ పక్ష నేతగా ఖర్గే పనిచేశారు.
దళిత వర్గానికి చెందిన ఖర్గేకు కాంగ్రెస్ లో మంచి పేరుంది. తాజాగా రాజ్యసభలో విపక్ష ఎంపీల సస్పెన్షన్ కు నిరసనగా మొత్తం విపక్షాన్ని ఏకం చేసి బీజేపీని రాజ్యసభలో ఇరుకునపెట్టడంలో, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యతో చర్చల్లోనూ ఖర్గే కీలకంగా వ్యవహరించారు.












Click it and Unblock the Notifications