సీఈసీపై విపక్షాల బ్రహ్మాస్త్రం..! కీలక చర్చలు- ఈసారి తాడోపేడో..!

కేంద్ర ఎన్నికల సంఘంలో ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాల్ని లెక్కచేయకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం, గోవా ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ఎస్ఐఆర్ లో తీసేసిన ఓట్లను తిరిగి జాబితాలో చేర్చాలని సీఈవో పదే పదే మెయిల్స్ పంపినా ఢిల్లీలో సాఫ్ట్ వేర్ పెట్టుకుని మౌనంగా ఉండిపోవడం వంటి ఆరోపణల్ని సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ను తక్షణం సాగనంపేందుకు విపక్షాలు (Opposition) సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు పార్లమెంట్ లో అభిశంసన అస్త్రాన్ని ప్రయోగించేందుకు వీలుగా చర్చలు జరుపుతున్నాయి.

మోడీ ఏరికోరి తెచ్చుకున్న ఈసీ కమిషనర్ల తిరుగుబాటు ? ఎవరీ సంధూ, వివేక్ జోషీ..?
మోడీ ఏరికోరి తెచ్చుకున్న ఈసీ కమిషనర్ల తిరుగుబాటు ? ఎవరీ సంధూ, వివేక్ జోషీ..?

గతంలో ఎన్నికల సందర్భంగా బయటపడిన అక్రమాలు, ఓటు చోరీ ఆరోపణల నేపథ్యంలో సీఈసీ జ్ఞానేష్ పై పార్లమెంట్ ఉభయసభల్లో అభిశంసన తీర్మానం పెట్టినా, దానిపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఈసారి ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఆధారాలతో కథనాలు ప్రచురించిన నేపథ్యంలో, వాటిని తీసుకుని సీఈసీపై అభిశంసన తీర్మానం పెట్టబోతున్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఉభయసభల్లో మరోసారి ఈ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తున్నాయి. అయితే ఈసారి కూడా కేంద్రం మౌనంగా ఉండిపోతే ఏం చేయాలన్న దానిపైనా తెరవెనుక చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

Opposition Plans Fresh Impeachment Motion Against CEC Gyanesh Kumar Sources
Breaking: 48 గంటల్లో సీఈసీ రాజీనామా- తేడా వస్తే దేశవ్యాప్త ఉద్యమం- కాక్రోచ్ అల్టిమేటం..!
Breaking: 48 గంటల్లో సీఈసీ రాజీనామా- తేడా వస్తే దేశవ్యాప్త ఉద్యమం- కాక్రోచ్ అల్టిమేటం..!

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై కొత్తగా అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టే విషయంలో కాంగ్రెస్ చొరవ తీసుకోగా, ఇండియా కూటమిలోని పార్టీలు ఒక అంగీకారానికి వచ్చాయని ఎన్డీటీవీ ఓ కథనం ప్రచురించింది. ఈ తీర్మానానికి సంబంధించిన నోటీసును రూపొందిస్తున్నారని, వచ్చే వారంలోనే దానిని పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
గతంలో ఏప్రిల్ 24న రాజ్యసభలోని 73 మంది విపక్ష ఎంపీలు దుష్ప్రవర్తన ఆరోపణల ఆధారంగా సీఈసీ జ్ఞానేష్ ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ నోటీసు సమర్పించారు. ఆ నోటీసులో తొమ్మిది నిర్దిష్ట ఆరోపణలు ఉన్నాయని కాంగ్రెస్ ఆ సమయంలో పేర్కొంది. అంతకు ముందు మార్చి 12న కూడా ఇలాంటి నోటీసు ఇచ్చినా రాజ్యసభ ఛైర్మన్ తిరస్కరించారు. అప్పట్లో ఇచ్చిన నోటీసు ఇంకా పెండింగ్‌లోనే ఉందని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. తాజాగా వెల్లడైన విషయాలను కూడా అందులో చేర్చి, ప్రతిపక్షం ఇప్పుడు కొత్త నోటీసును సిద్ధం చేస్తోందని విపక్ష పార్టీల నాయకులు చెప్తున్నారు.

ఢిల్లీ నుంచే ఈసీ ఓట్ల చోరీ ? రాష్ట్రాల్లో ఏమీ లేదా ? సుప్రీం ఆర్డర్ బేఖాతర్- మరో బిగ్ బాంబ్..!
ఢిల్లీ నుంచే ఈసీ ఓట్ల చోరీ ? రాష్ట్రాల్లో ఏమీ లేదా ? సుప్రీం ఆర్డర్ బేఖాతర్- మరో బిగ్ బాంబ్..!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+