కరోనా కట్టడికి ట్యాబెట్స్ .. ఎలా వాడాలి ..?. ధర ఎంత?.. దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో రిలీజ్..
కరోనా మహమ్మారి కట్టడికి భారత్ లో మరో మెడిసిన్ అందుబాటులోకి వచ్చింది. మోల్నుపిరావిర్ ట్యాబ్లెట్స్‌ను దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ మార్కెట్‌లోకి ఆప్టిమస్ సంస్థ విడుదల చేసింది. దీనికి అమెరికా, యూకేతో పాటు ఇటీవల డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా కూడా అనుమతి ఇచ్చింది. ఒకవైపు కరోనా, ఒమిక్రాన్ వ్యాప్తి కలవరపెడున్న ఈటైమ్ లో కరోనాకి విరుగుడుగా మోల్నుపిరావిర్ టాబ్లెట్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇది కొంత ఊరట కలిగించే విషయమే..

ట్యాబ్లెట్స్‌తో కరోనాకు విరుగుడు..
ఇండియాలో ఈ మోల్నుపిరావిర్ ట్యాబెట్స్ తయారు చేసుందుకు దాదాపు 13 కంపెనీలు అనుమతి తీసుకున్నాయి. అందులో ఆరు ఫార్మా కంపెనీలు హైదరాబాద్‌కి చెందివే ఉన్నాయి. ఆ 13 కంపెనీల్లో ఒక్కటైన ఆఫ్టిమస్ సంస్థ మోలోకోవిర్ పేరు ట్యాబ్లెట్స్ తయారు చేసింది. వీటిని హైదరాబాద్ మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ ట్యాబ్లెట్స్‌ను జనవరి 3 నుంచి మిగతా నగరాల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. త్వరలోనే మోల్నుపిరావిర్‌ను మార్కెట్‌లోకి తెచ్చేందుకు మిగిలిన ఫార్మా కంపెనీలు కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి..

ట్యాబ్లెట్స్ వాడే విధానం..
ఈ మోల్నుపిరావిర్‌ను 3 దశల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు., ఇటీవలే డీసీజీఐ అనుమతి పొందిందని వెల్లడించారు. 5 రోజుల్లోనే కరోనా వైరస్‌లోడును పూర్తిగా అదుపులోకి తెస్తుందని వివరించారు. ఈ ట్యాబ్లెట్స్ ను వైద్యుని పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కరోనా సోకిన వ్యక్తి రోజుకు 2 చొప్పున ఈ ట్యాబ్లెట్స్ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఒక్కొ ప్యాకెట్లో 5 స్ట్రిప్ లు ఉంటాయి. వీటిలో మొత్తం 40 మాత్రలు ఉంటాయని చెప్పారు. ఒక్కోమాత్ర ఖరీదు రూ.63 ఉంటుందని తెలిపారు. ఒక్కొ ట్యాబ్లెట్ 200 ఎంజీ డోసుతో తయారైందని ఆప్టిమస్ ఫార్మా సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

5 రోజుల్లో వైరస్ కట్టడి
కరోనా బారిన పడ్డ రోగులు ఆప్పత్రి పాలు కాకుండా ఉండాలన్న లక్ష్యంతో ఈ మోల్నుపిరావిర్ ను అభివృద్ధి చేసినట్లు వైద్య నిపుణులు పేర్కొన్నారు. అమెరికాలో జరిపిన పరిశోధనల్లో ఈ ట్యాబ్లెట్స్ డెల్టా వేరియంట్ వంటి మ్యూటేషన్లపై సమర్థవంతంగా పనిచేసినట్లు తెలిపారు. కరోనా లక్షణాలు కన్పించిన ఐదు రోజుల్లోపు మోల్నుపిరవిర్ వాడకం మొదలు పెట్టాలని.. ది సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ వెల్లడించింది. ప్రతి 12 గంటలకు ఒకటి చొప్పున ఐదు రోజుల పాటు 40 మాత్రలు వాడాలని తెలిపింది.












Click it and Unblock the Notifications