మేమే చేశాం: అశోక్ గజపతి రాజు శాఖపై ప్రధాని మోడీ ఇలా
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ ఎంపీ, కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజుకు చెందిన విమానయాన శాఖ మంత్రిత్వ శాఖపై ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో తాము మంచి ఏవియేషన్ పాలసీ తీసుకు వచ్చామన్నారు.
Recommended Video

Rajnath Singh Meets TDP MPs And Saves TDP-BJP Alliance
తాము అద్భుతమైన విమానయాన పాలసీని తీసుకు వచ్చామన్నారు. 21వ శతాబ్దం తమదే అని చెబుతున్న కాంగ్రెస్ పాలనలో ఏవియేషన్ పాలసీ అనేది లేదన్నారు. వారిది ఎద్దులబండి పాలసీ అని చెప్పారు. చిన్న విమానాశ్రయాలకు అద్భుతమైన విమానాశ్రయాలు తెచ్చామన్నారు.

కాగా, ప్రధాని మోడీ తన ప్రసంగంలో తాము ఏపీ రాష్ట్ర విభజనకు వ్యతిరేకం కాదని, కానీ ఇష్టారీతి విభజనకు వ్యతిరేకమని చెప్పారు. నీలం సంజీవరెడ్డి, పీవీ నర్సింహ రావు వంటి వారిని కాంగ్రెస్ అవమానించిందని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications