తుపాకీకి తుపాకే సమాధానం, మంగళూరు కాల్పులు భేష్, దేశమంతా నిప్పుపెట్టే ఛాన్స్: బీజేపీ నేత

కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అయిన తమిళనాడు బీజేపీ నేత హెచ్ రాజా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ మంగళూరులో ఆందోళన చేస్తున్నవారిపై పోలీసులు కాల్పు జరపడాన్ని స్వాగతించారు. అంతేకాదు పోలీసులు కాల్పులు జరుపడం మంచి పని అని, లేదంటే చాలా మంది ప్రజలపై వారు దాడులు చేసే అవకాశం ఉండేదని చెప్పారు.

 గన్‌కు గనే..

గన్‌కు గనే..

పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో మొదలైన నిరసనలు ఢిల్లీ నుంచి యూపీ, కర్ణాటకకు వ్యాపించాయి. శుక్రవారం మంగళూరులో కొందరు నిరసన చేపట్టారు. అయితే వారిపై పోలీసులు కాల్పుల జరపడంతో జలీల్, నౌసిన్ అనే ఇద్దరు చనిపోయారు. ఘటనపై హెచ్ రాజా స్పందించారు. తుపాకీకి తుపాకే సమాధానం అని చెప్పారు. కానీ కొందరు న్యాయ నిపుణులు కూడా ముస్లింలపై వివక్ష చూపిస్తున్నారని కామెంట్ చేయడాన్ని రాజా తప్పుపట్టారు.

ఫైర్ చేయకుంటే..

ఫైర్ చేయకుంటే..

మంగళూరులో వారిపై కాల్పులు జరపకుంటే వారు ఎంత బీభత్స సృష్టించేవారోనని రాజా అనుమానం వ్యక్తం చేశారు. అందుకే పోలీసులు కాల్పులు జరిపారని వత్తాసు పలికారు. ఇప్పడే కాదు దివంగత ద్రవిడ నేత పెరియార్‌పై కూడా రాజా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

దేశమంతా నిప్పు..

దేశమంతా నిప్పు..

మంగళూరులో నిరసనకారుల ఉద్దేశం అక్కడే నిప్పుపెట్టడం కాదని రాజా అన్నారు. దేశమంతా నిప్పుపెట్టాలని భావించారని పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ సోమవారం డీఎంకే చేపట్టే నిరసనకు అనుమతి ఇవ్వొద్దని పోలీసులను కోరారు. ర్యాలీకి అనుమతిస్తే హింస చెలరేగే అవకాశం ఉందని చెప్పారు.

క్రిస్మస్ హాలీ డేస్..

క్రిస్మస్ హాలీ డేస్..

మరోవైపు విద్యార్థులకు కూడా రాజా హితోపదేశం చేశారు. క్రిస్మస్ సెలవులను ఎంజాయ్ చేయాలని సూచించారు. కానీ ఆందోళనల్లో పొరపాటున కూడా పాల్గొనవద్దని సూచించారు. పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి రావడంతో దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. ఆయా చోట్ల పోలీసులు కాల్పులు జరపడంతో 11 నుంచి 13 మంది చనిపోయిన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+