మోడీకి 100 మందికి పైగా మాజీ బ్యూరోక్రాట్ల లేఖ-విద్వేష రాజకీయాలపై మౌనం వీడాలంటూ..
దేశవ్యాప్తంగా నానాటికీ పెరుగుతున్న విద్వేష వ్యాఖ్యలు, ప్రసంగాలు, రాజకీయాలపై మాజీ బ్యూరోక్రాట్లు గళం విప్పారు.వందకు పైగా మాజీ బ్యూరోక్రాట్లు ఈ మేరకు ప్రధాని మోడీ మౌనాన్ని ప్రశ్నిస్తూ ఆయనకు లేఖ రాశారు. ఇందులో తాజాగా చోటు చేసుకున్న పలు ఘటనల్ని ప్రస్తావించారు.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇటీవల జరిగిన మత హింసాత్మక ఘటనలపై 100 మందికి పైగా మాజీ బ్యూరోక్రాట్లు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ద్వేషపూరిత రాజకీయాలకు స్వస్తి పలకాలని ఆయన్ను కోరారు.మాజీ జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్, మాజీ విదేశాంగ కార్యదర్శి సుజాత సింగ్, మాజీ హోం కార్యదర్శి జీకే పిళ్లై, ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ టీకేఏ నాయర్ సహా 108 మంది ఈ లేఖపై సంతకాలు చేశారు.
ప్రధానమంత్రికి రాసిన లేఖలో వారు దేశంలోని రాజకీయ పరిస్థితుల గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు . మేము ఎదుర్కొంటున్న ముప్పు తీవ్రమైనదని , దేశం ప్రమాదంలో ఉందని విశ్వసిస్తున్నట్లు వారు లేఖలో పేర్కొన్నారు.దేశంలో రాజ్యాంగ పరిరక్షణకు రూపొందించిన సున్నితమైన పొర ఈ విద్వేష రాజకీయాలతో నలిగిపోయే ప్రమాదం పొంచి ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి ఇప్పటికైనా విద్వేష రాజకీయాలకు స్వస్తి పలకాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

సబ్కా సాత్, సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే మీ వాగ్దానాన్ని హృదయపూర్వకంగా స్వీకరించి, మీ మనస్సాక్షికి విజ్ఞప్తి చేస్తున్నామంటూ వారు ఈ లేఖలో పలు విషయాలు గుర్తుచేశారు. ఈ ఏడాది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో పక్షపాత వైఖరికి అతీతంగా మీరు అందరినీ కలుపుకుపోతారని ఆశిస్తున్నట్లు మాజీ బ్యూరోక్రాట్లు పేర్కొన్నారు. మీ పార్టీ నియంత్రణలో ఉన్న ప్రభుత్వాలు చాలా పట్టుదలతో అనుసరిస్తున్న ద్వేషపూరిత రాజకీయాలకు ఇప్పటికైనా ముగింపు పలకాలని వారు కోరారు.
మైనారిటీ వర్గాలపై మతపరమైన హింసను గుర్తుచేస్తూ అస్సాం, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, అనేక రాష్ట్రాల్లో గత కొన్నేళ్లుగా మైనారిటీ వర్గాలపై, ముఖ్యంగా ముస్లింలపై ద్వేషపూరిత హింస పెరిగిందని వారు ప్రధానికి తెలిపారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ మినహా బీజేపీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో పరిస్ధితులు దిగజారుతున్నాయని వారు తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ముస్లింలు మతపరమైన ద్వేషానికి ఎక్కువగా గురవుతున్నారని ఆరోపిస్తూ, "ముస్లింలకు వ్యతిరేకంగా ఉద్దేశించిన ద్వేషం, దుర్మార్గమని వారు ప్రస్తావించారు. రాష్ట్రాల్లోని నిర్మాణాలు, సంస్థలు, పాలనా ప్రక్రియల అంతరాయాలలో లోతుగా ఇమిడిపోయినట్లు కనిపిస్తోందన్నారు. బీజేపీ అధికారంలో ఉండటం శాంతి, సామరస్యాన్ని కాపాడే సాధనంగా కాకుండా మైనారిటీలను నిత్యం భయాందోళనకు గురిచేసే సాధనంగా మారిందన్నారు.
క్రమపద్ధతిలో తన సొంత పౌరుల్లోని మైనారిటీలు, దళితులు, పేదలు, అట్టడుగు వర్గాలను ద్వేషానికి గురిచేసే, వారి ప్రాథమిక హక్కులను హరించే దేశంగా మారే అవకాశం గతంలో కంటే ఇప్పుడు చాలా భయానకంగా ఉందన్నారు.హింసాత్మక ప్రాంతాలలో అక్రమ గృహాలను కూల్చివేసిన సంఘటనల గురించి ప్రస్తావిస్తూ బుల్డోజర్ ఇప్పుడు రాజకీయ, పరిపాలనా అధికారాలను అక్షరాలా, అలంకారికంగా అమలు చేయడానికి కొత్త రూపకంగా మారడంలో ఆశ్చర్యం లేదన్నారు. జహంగీర్ పురి ఘటనలో సుప్రీంకోర్టు ఆదేశాల్ని కూడా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడాన్నీ వారు తప్పుబట్టారు.
-
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
BCCI కు ఆ లక్కీ ఛాంప్ ఎలా దొరికింది? ప్రార్థన చేసి.. ప్రపంచ కప్ గెలిచి.. -
T20 World Cup Final: నోర్మూయిస్తాం..! చాలా చూశాం..! ఫైనల్ వేళ శాంట్నర్ వర్సెస్ సూర్య..! -
Adani Total Gas: గృహ వినియోగదారులకు ఊరట.. పరిశ్రమలకు గ్యాస్ సరఫరా తగ్గింపు -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
బరువు తగ్గాలంటే చనా వెజ్ సలాడ్ ఇలా ట్రై చెయ్యండి! -
టీమిండియాకు టీ20 కెప్టెన్ షాక్? రిటైర్మెంట్ వార్తలు నిజమేనా? -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!!












Click it and Unblock the Notifications