కోవిడ్‌తో పాటు మరో ఇన్పెక్షన్ ఉందా ? భారత్‌లో సగానికి పైగా మరణాలివే-ఐసీఎంఆర్
భారత్‌లో కరోనా సెకండ్‌వేవ్‌లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇప్పటికే 3 లక్షలకు పైగా రోగులు కరోనాతో చనిపోయారు. ఈ నేపథ్యంలో అసలు సెకండ్‌వేవ్‌లో మరణాల వెనుక ఏముందనే దానిపై ఐసీఎంఆర్ తాజాగా అధ్యయనం నిర్వహించింది. ముంబైలోని రెండు ప్రధాన ఆస్పత్రులతో పాటు మరో 8 ఆస్పత్రుల్లో నిర్వహించిన ఈ అధ్యయనంలో కరోనాతో పాటు మరో ఇన్‌ఫెక్షన్ ఉన్న వారే ఎక్కువగా చనిపోతున్నట్లు నిర్ధారణకు వచ్చింది.

సెకండ్‌వేవ్‌లో మరణమృదంగం
గతేడాది భారత్‌లో వ్యాపించిన కరోనా తొలిదశతో పోలిస్తే తాజాగా వెలుగుచూసిన రెండోదశలో మరణాల సంఖ్య అధికంగా ఉంది. ఆక్సిజన్ కొరత, ఇతరత్రా కారణాలతో మరణాలు చోటు చేసుకుంటున్నాయి. పలు చోట్ల తీవ్ర వ్యాధులతో బాధపడుతూ కరోనా చికిత్స తీసుకున్న వారు కూడా మరణిస్తున్నారు. దీంతో కరోనాకు మరో రోగం తోడైతే ఇక చావు తప్పదన్న పరిస్ధితి చాలా చోట్ల కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సైతం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ కరోనా బారిన పడిన వారు ఎక్కువగా మృత్యువాత పడుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య మూడు లక్షలు దాటిపోయింది. అమెరికా, బ్రెజిల్ తర్వాత ప్రపంచంలోనే ఇది మూడో అత్యధికం.

కరోనా మరణాలపై ఐసీఎంఆర్ అధ్యయనం
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌వేవ్‌లో మరణాల సంఖ్య పెరుగుతుండటంతో ఐసీఎంఆర్‌పై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో మరణాలకు అసలు కారణాల్ని తెలుసుకునేందుకు ఐసీఎంఆర్ తాజాగా పది ఆస్పత్రుల్లో మరణాలపై అధ్యయనం నిర్వహించింది. ఇందులో ముంబైలోని సియాన్, హిందూజాతో పాటు మరో 8 ఆస్పత్రుల్లో మరణాలపై ఐసీఎంఆర్ సమగ్ర వివరాలు సేకరించింది. ఆయా ఆస్పత్రుల్లో చేరుతున్న రోగులు, వారికి అందుతున్న చికిత్స, వారి హెల్త్ రికార్డ్ ఆధారంగా ఈ అధ్యయనం సాగింది. వీటి ఫలితాలను తాజాగా ఐసీఎంఆర్ వెల్లడించింది.

మరో ఇన్‌ఫెక్షన్ తోడైతే మరణమే
దీర్ఘకాలిక వ్యాధులతో బాఢపడుతున్న వారు కరోనా బారిన పడితే మరణాలు తప్పడం లేదని ఐసీఎంఆర్ తాజా అధ్యయనం తేల్చింది. ముఖ్యంగా కరోనాతో పాటు మరో ఇన్‌పెక్షన్‌తో బాధపడుతున్న వారే ఈసారి ఎక్కువగా చనిపోతున్నట్లు ఐసీఎంఆర్ నిర్దారించింది. కరోనాతో పాటు మరో బ్యాక్టీరియల్ లేదా ఫంగల్ ఇన్‌ఫెక్షన్ తోడైతే మరణాలు తప్పవని ఐసీఎంఆర్ అధ్యయనంలో తేలింది. ఈ ఇన్‌పెక్షన్ కరోనా చికిత్స తీసుకుంటున్న సమయంలో కానీ, పూర్తయిన తర్వాత కానీ తోడైతే మరణమే శరణ్యంగా మారుతోందని ఐసీఎంఆర్ చెబుతోంది.

కరోనా మరణాలకు అసలు కారణమిదే
ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలకు కోవిడ్ ఇన్‌పెక్షన్ 10 శాతం కారణంగా తేలగా.. ఐసీఎంఆర్ అధ్యయనంలో మరో ఇన్‌ఫెక్షన్ తోడైతే ఈ సంఖ్య 50 శాతం దాటేస్తున్నట్లు తెలుస్తోంది. బ్యాక్టీరియల్ లేదా ఫంగల్ ఇన్‌ఫెక్షన్ సోకిన కరోనా రోగులకు దీర్ఘకాలిక చికిత్స అవసరమని, దానికి తగినట్లుగా యాంటీబయోటిక్స్ వాడకం అవసరమని ఐసీఎంఆర్ చెబుతోంది. ఇందులో ఎక్కడైనా లోటుపాట్లు ఎదురైతే మాత్రం రోగులు చనిపోతున్నట్లు ఐసీఎంఆర్ తేల్చింది. మరోవైపు ఈ యాంటీబయోటిక్స్ శాతం ఎక్కువైనా బ్లాక్ ఫంగస్ వంటి రోగాలతో చనిపోతున్నట్లు ఇతర అధ్యయనాలు చెప్తున్నాయి.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications