'ఆ సమయంలో నేనే ప్రధాని అయితే'.. అసదుద్దీన్ సంచలనం..!
AIMIM చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడి సమయంలో మీరు దేశ ప్రధానిగా ఉంటే ఏం చేస్తారు..? అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో ఓవైసీ షాకింగ్ జవాబు ఇచ్చారు. ఆ సమయంలో తాను ఊహల్లో ఉండనని.. రియాల్టీ ఎలా ఉంది అనే దానిపై దృష్టి పెడతానని తెలిపారు. కలలు కనకుండా వాస్తవంపైనే దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. నా పరిధి ఏంటో గ్రహించి అందుకు అనుగుణంగా నడుచుకుంటానని స్పష్టం చేశారు. అయితే తన లక్ష్యం ప్రధాని పదవిని స్వీకరించడం లేదా మంత్రిని అవ్వడం కాదని తేల్చి చెప్పారు.
అలాగే ఏఐఎమ్ఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఏప్రిల్ 22 పహల్గాం ఎటాక్ తర్వాత కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్ పై తీసుకున్న నిర్ణయాలు, మిలిటరీ చర్యలను ప్రశ్నించారు. పాకిస్థాన్ పై ఆపరేషన్ సింధూర్ ను ఎందుకు నిలిపివేశారని మండిపడ్డారు. 'ఒక సగటు భారతీయుడిగా నేను చెప్పదలచుకుంది ఇదే.. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ కు తగిన బుద్ధి చెప్పేందుకు మనకు అవకాశం ఏర్పడింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆపరేషన్ సింధూర్ ను కొనసాగించలేదు' అని ప్రశ్నించారు. ఈ మేరకు పుణెలో నిర్వహించిన సమావేశంలో రిపోర్టర్లతో మాట్లాడారు.

పాకిస్థాన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ మొత్తం సిద్ధమైన వేళ.. ప్రజల దృష్టి మరల్చి యుద్ధవాతావరణాన్ని క్రియేట్ చేశారని తెలిపారు. గుజరాత్ నుంచి కాశ్మీర్ వరకు పాకిస్థాన్ డ్రోన్ లు కుప్పకూలినట్లు ప్రచారం చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆపరేషన్ సింధూర్ ను ఎందుకు నిలిపివేశారని .. అలాంటి అవకాశాలు మళ్లీ రావని తేల్చారు. జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గామ్ లోయలో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు జరిపిన మారణ హోమంలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ఈ ఘటన వెనకున్నట్లు తేలింది. అనంతరం పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. వందలాది మంది ఉగ్రవాదులను ఏరివేసింది.












Click it and Unblock the Notifications