రాష్ట్రపతితో అమిత్ షా, జైశంకర్ భేటీ, చేతిలో రెడ్ ఫైల్!
Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. పహల్గాం ఉగ్రదాడిలో 27 మంది పర్యాటకులు మృతి చెందిన నేపథ్యంలో పాకిస్థాన్ దేశంపై భారత్ పలు ఆంక్షలకు సిద్ధమైంది. పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
పాక్ జాతీయులకు అన్ని వీసాలను రద్దు చేసింది. భారతదేశంలో ఉన్న పాకిస్థానీయులు 48 గంటల్లోకా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. వాఘా బోర్డర్‌ను మూసివేసింది. ఈ క్రమంలో పాకిస్థాన్ కూడా భారత్ పట్ల ఇలాంటి చర్యలకు దిగింది. భారత విమానాలను తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు పాక్ ప్రకటించింది. ఇరుదేశాల మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలు ఉద్రిక్తలను మరింతగా పెంచుతున్నాయి.

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సిద్ధమైన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో భేటీ అయ్యారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. పహల్గాం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి పలు అంశాలను ఆమెకు వివరించినట్లు సమాచారం. ఈ భేటీకి సంబంధించిన ఫొటోను రాష్ట్రపతి తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు.
కాగా, ఈ సమావేశానికి వెళ్లిన ఇద్దరు మంత్రులు సర్వ సైన్యాధిపతి అయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముందు రెడ్ ఫైల్ ఉంచారు. ఇప్పుడు ఈ రెడ్ ఫైల్ హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో ఏముందనేది ఆసక్తిగా మారింది. పాకిస్థాన్‌పై ఏదైనా సైనిక చర్య ఉంటుందా? మరేదైనా సంచలన నిర్ణయం ఉంటుందా? అనేది ఉత్కంఠగా మారింది.
మరోవైపు, పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ.. చైనా, కెనడాతో సహా జీ20 దేశాల ఎంపిక చేసిన రాయబారులతో సమావేశం నిర్వహించింది. ఈ భేటీ దాదాపు 30 నిమిషాలపాటు కొనసాగినట్లు తెలిసింది. పహల్గాం దాడిలో పాకిస్థాన్ ప్రమేయం గురించిన ఆధారాలను కూడా విదేశాంగ మంత్రిత్వ శాఖ జర్మనీ, జపాన్, పోలాండ్, యుకే, రష్యా సహా 20 దేశాల రాయబారుల ముందుంచింది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications