ఉగ్రవాదుల మారణహోమం.. బాడీ క్యామ్ లతో లైవ్ స్ట్రీమింగ్ చేశారా?
కాశ్మీర్ లోని అందమైన పహల్గామ్ లో పర్యాటకులపై జరిగిన మారణ హోమం ఇప్పుడు దేశం మొత్తాన్ని ఆలోచించేలా చేస్తుంది. ఒకసారిగా పర్యాటకుల పైన విరుచుకుపడిన ఉగ్రవాదులు 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. ప్రస్తుతం ఉగ్రదాడి కి సంబంధించి ఒళ్ళు గగుర్పొడిచే విషయాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి.
ఉగ్రవాదులు చేసిన దారుణం చెప్పిన బాధితులు
ఉగ్రవాదులు ముఖ్యంగా హిందువులను టార్గెట్ చేసుకుని చేసిన ఈ దాడిలో వారు తమ శరీరాలకు బాడీ క్యామ్ లను పెట్టుకొని, వాటిలో వారిని హతమారుస్తూ ఉన్న దృశ్యాలను రికార్డు చేశారు. ఇక ఇదే విషయాన్ని ప్రాణాలతో బయటపడిన వారు చాలామంది చెబుతున్నారు. బాధితులు అనేక భయానకమైన అనుభవాలను చెబుతూ కన్నీటి పర్యంతం అవుతున్నారు.

బాడీ క్యామ్ లతో ఉగ్రవాదులు
ఇక ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఎంతోమంది అత్యంత అమానవీయంగా జరిగిన దాడిలో మారణకాండను కళ్ళకు కట్టినట్లు చెబుతున్నారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఫ్లోరిడాకు చెందిన టిక్కి బిటన్ అధికారి భార్య సోహిని తన భర్త మరణం గురించి షాకింగ్ విషయాలు వెల్లడించారు. తీవ్ర భావోద్వేగానికి లోనైన ఆమె తన భర్తను కాల్చి చంపిన ఉగ్రవాది నుదుటికి ఒక వీడియో కెమెరా కట్టుకొని ఉన్నాడన్నారు.
దారుణాలను చిత్రీకరిస్తూ లైవ్ స్ట్రీమింగ్ చేశారా?
ఈ దారుణాలను వారు చిత్రీకరిస్తూ ఎవరికో లైవ్ స్ట్రీమింగ్ చేసి ఉండొచ్చు అంటూ ఆమె పేర్కొన్నారు. తన భర్తను తుపాకీతో బెదిరించి మతం చెప్పమని అడిగారని, అతను మౌనంగా ఉండడంతో కల్మా చదవమని ఆదేశించారని తనకు చదవడం రాదని చెప్పడంతోనే ఉగ్రవాదులు తన భర్తను కాల్చి చంపారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.
తలకు కెమెరా పెట్టుకున్నారన్న పదేళ్ళ బాలుడు
ఇక ఉగ్ర దాడిని ప్రత్యక్షంగా చూసిన ప్రాణాలతో బయటపడిన పది సంవత్సరాల నక్ష్ ఉగ్రవాదులు తమ దాడులను కెమెరాలతో చిత్రీకరించారని, వాళ్ల బాడీలకు కెమెరాలు పెట్టుకున్నారని తెలిపాడు. ముంబైలోని ఎస్బిఐ కందీవలి బ్రాంచ్లో బ్యాంకర్ గా పనిచేస్తున్న శైలేష్ కలాధియా నక్ష్ తండ్రి. ఉగ్రవాదుల దాడులలో ప్రాణాలు కోల్పోయిన 26 మందిలో ఆయన ఒకరు.
కెమెరాలతో చంపే విజువల్స్ చిత్రీకరణ
ఆరోజు ఏం జరిగిందో చెప్పిన శైలేష్ కలాధియా కొడుకు నక్ష్ తామంతా ఆకలిగా ఉండడంతో తినడానికి వెళ్లామని, ఉన్నట్టుండి కాల్పుల మోత వినిపించడంతో అందరం భయపడ్డాం అని, ఉగ్రవాదులు తమ ముఖానికి కెమెరాలు అమర్చుకొని మరణ హోమానికి పాల్పడ్డారని చెప్పారు. ముష్కరులు కెమెరాలతో ప్రాణాలు తీస్తున్న దృశ్యాలను చిత్రీకరించారని, అది చూసిన తనకు భయమేసిందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications