భారతమాత కన్న గొప్పబిడ్డ హెడ్గేవార్: విజిటర్స్ బుక్‌లో ప్రణబ్ ఆసక్తికరం
నాగపూర్: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురువారం ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపక సర్ సంఘ్ చాలక్ కేశవ్ బలిరాం హెడ్గేవార్ జన్మస్థలాన్ని సందర్శించారు. నాగపూర్‌లోని హెడ్గేవార్ స్మారక కేంద్రాన్ని సందర్శించిన ఆయన విజిటర్స్ బుక్‌లో ఆసక్తికరమైన సందేశాన్ని రాశారు.
భారతమాత కన్న గొప్ప బిడ్డ కేబీ హెడ్గేవార్ అని ఆయన అభివర్ణించారు. 'భారతమాత కన్న గొప్ప బిడ్డకు నివాళులర్పించేందుకు ఇక్కడికి వచ్చాను' అని ప్రణబ్ విజిటర్స్ బుక్‌లో రాశారు.

అంతకుముందు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వచ్చిన ప్రణబ్‌కు ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ సాదర స్వాగతం పలికారు. ప్రణబ్‌తో మోహన్ భగవత్ సుమారు 20 నిమిషాలపాటు చర్చించారు.














Click it and Unblock the Notifications