అల్లర్లు, పాక్: రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు

కమలదళం రేపిన చిచ్చు వల్లనే ముజఫర్ నగర్‌లో ఐఎస్ఐ పాగా వేయాలని చూస్తోందని ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. గురువారం సాగర్ జిల్లా రహత్‌గఢ్, ఇండోర్‌లలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలలో ఆయన ప్రసంగించారు.
ఈ సందర్భంగా బుందేల్‌ఖండ్‌లో 2009నాటి తన పర్యటనను రాహుల్ గుర్తుచేసుకున్నారు. "ఇక్కడి ప్రజలతో కలిసి నిద్రించా. వారితో భోజనం పంచుకున్నా. నన్ను 25 వేల దోమలు కుట్టాయ్. గ్రామాల్లో నీళ్లు తాగి ఉదరకోశ సమస్యలతో బాధపడ్డా. అయితేనేం, నిరుపేదల బాధలేమిటో తెలిసొచ్చాయి. అందుకే ప్రధాని మన్మోహన్‌తో మాట్లాడి రూ.4,750 కోట్ల ప్యాకేజీ మంజూరు చేయించా. దీని కింద బిజెపి సర్కారు ఎన్ని బావులు తవ్వించిందో రైతులు తెలుసుకోవాలంటున్నారు'' అని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం కేంద్రం ఇచ్చే నిధులను ప్రజా సంక్షేమానికి ఖర్చు చేయడం లేదని ఆరోపించారు. యూపిఏ ప్రభుత్వం పేదల కోసం ఉపాధి హామీ, ఆహారభద్రత, భూసేకరణ వంటి పథకాలను ప్రవేశపెట్టిందని ఉదాహరించారు. అయితే, బిజెపి మాత్రం ఎయిర్ కండిషనర్లు వినియోగించే ధనికుల కోసమే రాజకీయాలు చేస్తుందని దుయ్యబట్టారు. ప్రధానిగా పేదల కోసం నిత్యం ఆలోచించే తన తండ్రి రాజీవే తన 'హీరో' అని రాహుల్ వ్యాఖ్యానించారు.
కాగా, రాహుల్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. "బిజెపికి ముందు కాంగ్రెస్ పదేళ్లు రాష్ట్రాన్నేలింది. అప్పుడు బుందేల్‌ఖండ్‌ను పట్టించుకోలేదుగానీ, ఇప్పుడు కాంగ్రెస్ విపి (వైస్‌ప్రెసిడెంట్) మావి ఎయిర్ కండిషనింగ్ రాజకీయాలంటున్నారు. ప్రజలు 2003లో మీమీద యుద్ధం ప్రకటించి, అధికారం మాకెందు కిచ్చారో గుర్తుచేసుకోండి మరి!'' అని ఎద్దేవా చేశారు. అదే సమయంలో ముజఫర్ నగర్ అల్లర్లపై రాహుల్ వ్యాఖ్యలను ఇతర బిజెపి నేతలు తప్పుపట్టారు.












Click it and Unblock the Notifications