పాక్ గగనతలం మూసివేస్తే భారత విమానాయాన సంస్థకు వచ్చే నష్టమేంటి..?
జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ భారత్‌పై కక్షసాధింపు చర్యలకు దిగుతోంది. కడుపుమంటతో రగిలిపోతోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే భారత వాణిజ్యంపై దెబ్బకొట్టిన పాకిస్తాన్... తాజాగా భారత విమానాలు తమ గగనతలంలోకి రాకుండా ఆంక్షలు విధించింది. అంతేకాదు రహదారులను కూడా మూసివేస్తోంది. బాలాకోట్ దాడుల తర్వాత గగనతలం మూసివేసిన పాకిస్తాన్... తిరిగి జూలై 16న తెరిచింది. తాజాగా చోటుచేసుకున్న పరిణామాలతో తిరిగి గగనతలంను మూసివేసే యోచనలో ఉంది. అయితే పాకిస్తాన్ భారత విమానాలు తమ గగనతలంలో ఎగరకుండా ఎయిర్‌స్పేస్‌ను మూసివేస్తే ఎలాంటి నష్టాలు వస్తాయి..?

పాక్ గగనతలం మూసివేస్తే భారత విమానాల పరిస్థితేంటి..?
జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ భారత్‌పై కన్నెర్ర చేసింది. ఎన్ని విధాల నష్టాలు చేకూర్చాలో అన్ని విధాలా పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే భారత విమానాలు తమ గగనతలం వినియోగించకుండా మూసివేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. బాలాకోట్ దాడుల తర్వాత ఫిబ్రవరి 26న తమ గగనతలంను మూసివేసిన పాక్ తిరిగి జూలై 16న తెరిచింది. మళ్లీ మూసివేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. పాక్ గగనతలం మూసివేస్తే విమానాలు భారత్‌కు చేరుకోవాలంటే అదనంగా 70 నుంచి 80 నిమిషాలు సమయం పడుతుంది. పాక్ గగనతలం మీదుగా మొత్తం 11 రూట్లు ఉన్నాయి. ఒకవేళ పాకిస్తాన్ తన గగనతలంను భారత విమానాలకు మూసివేస్తే ఉత్తరభారతం నుంచి పాశ్చాత్యదేశాలకు వెళ్లే విమానాలపై ఈ ప్రభావం పడుతుంది. అంటే ఢిల్లీ, లక్నో, జైపూర్, చండీగఢ్, అమృత్‌సర్ విమానాశ్రయాల నుంచి వెళ్లే విమానాలకు కష్టతరం అవుతుంది. ఈ విమానాలన్నీ గుజరాత్ లేదా మహారాష్ట్ర మీదుగా వెళ్లి అరేబియన్ సముద్రంకు కుడివైపున తిరిగి యూరోప్, ఉత్తర అమెరికా, పశ్చిమాసియా దేశాలకు వెళ్లాల్సి ఉంటుంది.

ఇంధనం నింపుకోవాల్సిన పరిస్థితి
పాక్ గగనతలం మూసివేసిన సమయంలో ఢిల్లీ నుంచి చికాగో వెళ్లే ఎయిరిండియా నాన్‌స్టాప్ విమానం యూరోప్‌లో ఆగి ఇంధనం నింపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీ నుంచి ఇస్తాంబుల్ వెళ్లే ఇండిగో విమానం కూడా దోహాలో ఆగి ఇంధనం నింపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఢిల్లీ నుంచి కాబుల్‌కు వెళ్లే ఏకైక విమానాయాన సంస్థ స్పైస్ జెట్ అయితే తన విమాన సేవలనే నిలిపివేసుకుంది. విమాన సమయం పెరిగే కొద్దీ ఇంధనం తరిగిపోతుందని దీంతో భారతీయ విమానాయాన సంస్థ నష్టాల బాట పడుతుంది. గతసారి పాకిస్తాన్ గగనతలం మూసివేసిన సమయంలో భారత్‌కు రూ.700 కోట్లు నష్టం వాటిల్లింది. ఎక్కువగా ఎయిరిండియా విమానాయాన సంస్థకే నష్టం వాటిల్లింది. ఇక ప్రయాణికులకు కూడా టికెట్ ధరలు పెరగనున్నాయి.

పాకిస్తాన్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?
పాకిస్తాన్ గగనతలం మూసివేయడం వల్ల ఆదేశమే ఎక్కువగా నష్టపోతుంది. గతంలో పాక్ గగనతలం మూసివేసిన సమయంలో రెవిన్యూ పరంగా 50 మిలియన్ డాలర్లు నష్టం వాటిల్లినట్లు సమాచారం. ముందుగానే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్.. ఈ రెవిన్యూ కనుక వచ్చిఉంటే కొంతలో కొంతైనా గట్టెక్కేది. జూన్‌లో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో 8.9శాతం ఆర్థికలోటు ఉన్నట్లు ఆదేశ ఆర్థిక నివేదిక వెల్లడించింది. అంతకుముందు ఇది 6.6శాతంగా ఉన్నింది. ఇక జూలైలో ప్రారంభమైన కొత్త ఆర్థిక సంవత్సరంలో పాకిస్తాన్ తన రెవిన్యూ లక్ష్యాన్ని 40శాతం ఉండేలా చూసుకోవాలని అవసరం ఏర్పడింది. రెవిన్యూ లక్ష్యాలను అందుకోలేకపోతే ఐఎంఎఫ్ కూడా రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు.












Click it and Unblock the Notifications