పది ముక్కలవుతుంది: పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ హెచ్చరిక
శ్రీనగర్: ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌పై భారత హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరోసారి తీవ్ర హెచ్చరిక చేశారు. భారతదేశాన్ని మత ప్రాతిపదికన విభజించేందుకు పాకిస్థాన్ కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు. ఈ ప్రయత్నాలు ఫలించబోవని స్పష్టంచేశారు.
అంతేగాక, ఉగ్రవాదానికి ఆశ్రయం ఇవ్వడం మానుకోకపోతే ఆ దేశం పది ముక్కలవడం ఖాయమని హెచ్చరించారు. మృతవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం కథువా జిల్లాలో ఏర్పాటైన సభలో ఆయన ప్రసంగించారు. ప్రపంచమంతా ఐసిస్ వల్ల ఆందోళన చెందుతున్నా.. మనదేశంలో మాత్రం పెద్దగా ఆదరణ పొందలేకపోయిందని చెప్పారు. ఇస్లాంను ఆచరిస్తున్న భారత్‌లోని నిజమైన ముస్లింలే దానికి కారణమన్నారు.

'1947లో మత ప్రాతిపదికన మనం విడిపోయాం. దానిని ఇప్పటికీ మరిచిపోలేం. హిందూ తల్లి గర్భం నుంచి జన్మించినా, ముస్లిం తల్లి గర్భం నుంచి పుట్టినా భారతీయులంతా సోదరులే' అని ఆయన స్పష్టం చేశారు.
'భారత్‌లో మినహా ప్రపంచంలో మరెక్కడా 72 ముస్లిం తెగలు కలిసి శాంతియుతంగా జీవిస్తున్న వాతావరణం కనిపించదు. అందరినీ కలుపుకొని అభివృద్ధిపథంలో ముందుకు వెళ్లాలనేదే భారతదేశ సంకల్పం' అని రాజ్‌నాథ్ స్పష్టంచేశారు. పాకిస్థాన్ నిజంగా ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని కోరుకుంటే సహకరించడానికి భారతదేశం సిద్ధమేనని చెప్పారు.












Click it and Unblock the Notifications