పాక్‌కి గట్టి షాక్: చొరబాటుకు యత్నిస్తే.. 13 మంది ఉగ్రవాదులను కాల్చి చంపేశారు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులకు, భారత భద్రతా దళాలకు మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. నియంత్రణ రేఖ వెంబడి భారత్‌లోకి చొరబడేందుకు యత్నించిన 13 మంది ఉగ్రవాదులను మనదేశ సైన్యం మట్టుబెట్టింది. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో పలువురు భారత సైనికులు కూడా గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Recommended Video
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే) నుంచి ఉగ్రవాదులు భారత్‌లో ప్రవేశించే అవకాశం ఉందని సమాచారం అందుకున్న భద్రతా దళాలు సంబంధిత ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో అక్రమంగా సరిహద్దులోకి ప్రవేశిస్తున్న ఉగ్రవాదులు సైన్యం కంటపడ్డారు.

వెంటనే వారిపై భద్రతా దళాలు తూటాల వర్షం కురిపించింది. దీంతో 13 మంది ఉగ్రవాదులు అక్కడికక్కడే హతమయ్యారు.మార్చి 28 నుంచే ఉగ్రవాదులు భారత్ లోకి అక్రమంగా ప్రవేశించేందుకు కుట్రలు పన్నుతున్నారనే సమాచారం ఉందని ఓ సీనియర్ సైన్యాధికారి తెలిపారు.
ఈ నేపథ్యంలోనే సెర్చ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయన్నారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఎదురుకావడంతో వెంటనే అప్రమత్తమైన సైనికులు ఉగ్రవాదులపై కాల్పులు జరిపి మట్టుబెట్టాయని తెలిపారు. ఉగ్రవాదుల వద్ద భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు, ఆయుధాలు ఉన్నట్లు గుర్తించారు.
ఇది ఇలావుంటే, భారీ నార్కో టెర్రర్ మాడ్యూల్‌ను జమ్మూకాశ్మీర్ పోలీసులు ఛేదించారు. సోమవారం ఉదయం ఆరుగురు నార్కో ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వీరికి జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. వీరి నుంచి భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్‌కు తాకట్టు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications