Seema Haider: పాక్ జాతీయురాలు సిమా హైదర్‍కు సినిమా ఛాన్స్..!

ప్రేమించిన వ్యక్తి కోసం దేశం దాటొచ్చిన సిమా హైదర్ కు మూవీ ఛాన్స్ వచ్చింది. ఈ లేడీకి బాలీవుడ్ నిర్మాత అమిత్ జానీ సినిమా ఆఫర్ ఇచ్చారు. సిమా హైదర్ కు పజ్ జీ గేమ్ లో భారత్ కు చెందిన వ్యక్తి పరిచయమయ్యాడు. పరిచయం ప్రేమగా మారడంతో ఆమె తన పిల్లలతో పాటు పాక్ సరిహద్దు దాటి భారత్ లోకి అక్రమంగా చొరపడ్డారు. ఆమె సచిన్ మీనాన్ పెళ్లి చేసుకున్నారు. వారు ప్రస్తుతం ఉత్తప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో ఉంటున్నారు.

ఆమెకు తాజాగా ఉదయ్ పుర్ టైలర్ కన్హయ్య లాల్ హత్య ఆధరంగా ఏ టైలర్ మర్డర్ స్టోరీని జానీ ఫైర్ ఫాక్స్ ప్రొడక్షన్ హౌస్ తెరకెక్కిస్తోంది. ఈ మూవీలో రా ఏజెంట్ పాత్ర కోసం సీమా హైదర్ తో మాట్లాడారు. ఇప్పటికే సిమా హైదర్ ఆడిషన్ కూడా ఇచ్చారు. సిమా హైదర్ ఆడిషన్ దర్శకుడు జయంత్ సిన్హా, భరత్ సింగ్ మంగళవారం నిర్వహించారు. సిమా హైదర్ పాక్ నుంచి భారత్ లోకి అక్రమంగా అడుగు పెట్టడంతో ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ (ATS) అదుపులోకి తీసుకుంది.

seemahaider1

హైదర్ తన నలుగురు పిల్లలతో సహా అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించినందుకు ఈ నెల ప్రారంభంలో అరెస్టు చేయగా.. ఆమెకు సచిన్ మీనా ,అతని తండ్రి వారికి ఆశ్రయం కల్పించినందుకు అరెస్టు చేశారు. ప్రస్తుతం వీరందరికి బెయిల్ వచ్చింది. పాకిస్తాన్‌లోని సింధ్‌కు చెందిన 27 ఏళ్ల వివాహిత నలుగురి పిల్లల తల్లి సీమా హైదర్, 2020లో కరోనావైరస్ మహమ్మారి సమయంలో ఆన్‌లైన్ షూటింగ్ గేమ్ PUBG ఆడుతున్నప్పుడు భారతదేశానికి చెందిన 22 ఏళ్ల అవివాహిత షాప్ కీపింగ్ అసిస్టెంట్ సచిన్ మీనాతో కనెక్ట్ అయ్యారు.

సీమా సచిన్ మీనాను మార్చిలో తొలిసారి నేపాల్‌లో కలుసుకున్నారు. మేలో సీమా, ఆమె పిల్లలు దుబాయ్, నేపాల్ మీదుగా నోయిడా వచ్చారు. న్యూఢిల్లీ నుండి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రేటర్ నోయిడాలోని రబుపురా గ్రామంలో అద్దెకు తీసుకున్న అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. తాము పెళ్లి చేసుకున్నామని, భారత్‌లోనే కలిసి ఉండాలనుకుంటున్నామని ఈ జంట అప్పట్లో స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+