వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్మీ జవాన్ పై పాకిస్థానీ యువతుల హనీట్రాప్; సైనిక సమాచారం లీక్; అసలేం జరిగిందంటే!!

|
Google Oneindia TeluguNews

భారత దేశం పై పాకిస్థానీ కుట్రలు ఆగడం లేదు. భారతదేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడానికి నిత్యం టెర్రరిస్టులకు సహాయ సహకారాలను అందిస్తున్న పాకిస్తాన్, తాజాగా ఆర్మీ జవాన్ లపై వలపు ఎర వేస్తూ అమ్మాయిలను ఉసిగొల్పుతోంది. తాజాగా ,భారత సైనికులపై పాకిస్తాన్ అమ్మాయిలు వలపు వల విసిరిన ఉదంతం వెలుగులోకి రావడంతో పాకిస్తాన్ కుట్రలు మరోమారు బయటపడ్డాయి.

ఆర్మీ జవాన్ హనీ ట్రాప్ .... పాకిస్థాన్‌కు సైనిక సమాచారం లీక్... ఆర్మీ జవాన్ అరెస్ట్

ఆర్మీ జవాన్ హనీ ట్రాప్ .... పాకిస్థాన్‌కు సైనిక సమాచారం లీక్... ఆర్మీ జవాన్ అరెస్ట్

పాకిస్థానీ యువతుల హనీ ట్రాప్ లో పడిన ఆర్మీ జవాన్ మన సైన్యానికి చెందిన రహస్య సమాచారాన్ని లీక్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ విషయం రాజస్థాన్ ఇంటెలిజెన్స్ పోలీసుల దర్యాప్తులో తేలింది. పాకిస్థాన్‌కు సైనిక సమాచారాన్ని లీక్ చేశారనే ఆరోపణలపై భారత ఆర్మీ జవాన్ శాంతిమయ్ రాణా (24)ను అరెస్టు చేశారు. భారత సైన్యానికి సంబంధించిన సమాచారాన్ని లీక్ చేసే విధంగా పాకిస్థానీ మహిళలు అతడిని హనీట్రాప్ చేశారు. పాకిస్తానీ అమ్మాయిల వలపు వలలో పడిన విషయం గుర్తించకుండా ఆ అమ్మాయిలు అడిగిన అన్ని సమాచారాలను ఆర్మీ జవాన్ అందించాడు. దీంతో అధికారిక రహస్యాల చట్టం, 1923 కింద కేసు నమోదు చేసి జవాన్‌ను అరెస్టు చేశారు.

సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకున్న ఇద్దరు మహిళలు .. ట్రాప్ చేసి సైనిక సమాచారం

సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకున్న ఇద్దరు మహిళలు .. ట్రాప్ చేసి సైనిక సమాచారం


శాంతిమయ్ రాణా పశ్చిమ బెంగాల్‌లోని బాగుండా జిల్లాలోని కంచన్‌పూర్ గ్రామ నివాసి. జైపూర్‌లోని ఆర్టరీ యూనిట్‌లో ఆయనను నియమించారు. రాజస్థాన్ పోలీసు ఇంటెలిజెన్స్ వింగ్ డైరెక్టర్ జనరల్ ఉమేష్ మిశ్రా మాట్లాడుతూ, పాకిస్థానీ ఏజెంట్లు గుర్నౌర్ కౌర్ అలియాస్ అంకిత మరియు నిషా ఆర్మీ జవాన్‌ను సోషల్ మీడియా ద్వారా సంప్రదించారని, తర్వాత ఇద్దరు మహిళలు రాణా నంబర్ తీసుకున్నారని ఇంటెలిజెన్స్ వింగ్ తెలిపింది. వారిద్దరూ రాణాతో వాట్సాప్‌లో మాట్లాడుతుండేవారని పేర్కొన్నారు. ఇద్దరూ మొదట రాణాను నమ్మించారని, ఆపై ఆమె అతని నుండి నిఘా సమాచారాన్ని తీసుకోవడం ప్రారంభించారని తెలిపారు. అందుకు ప్రతిగా రాణా ఖాతాకి కొంత డబ్బు కూడా బదిలీ చేసినట్టుగా పేర్కొన్నారు

వారు పాకిస్థానీ ఏజెంట్లు అని తెలియదని వెల్లడించిన ఆర్మీ జవాన్

వారు పాకిస్థానీ ఏజెంట్లు అని తెలియదని వెల్లడించిన ఆర్మీ జవాన్

తాను మార్చి 2018 నుంచి ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నానని, వాట్సాప్ చాట్, వీడియో, ఆడియో మెసేజ్‌ల ద్వారా పాకిస్థాన్ మహిళా ఏజెంట్‌ లతో చాలా కాలంగా టచ్‌లో ఉన్నానని రాణా తెలిపాడు. గుర్నౌర్ కౌర్ అలియాస్ అంకిత తనను తాను షాజహాన్‌పూర్ (ఉత్తరప్రదేశ్) నివాసి అని చెప్పిందని పేర్కొన్నాడు. అక్కడ మిలటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్‌లో పనిచేశానని ఆ మహిళ రాణాను నమ్మించింది. మరో మహిళ తన పేరు నిషా అని చెప్పిందని, తాను మిలటరీ నర్సింగ్ సర్వీస్‌లో పనిచేస్తున్నానని చెప్పిందని పేర్కొన్నారు. వారు పాకిస్థానీ ఏజెంట్లు అని తెలియదని ఆర్మీ జవాన్ పేర్కొన్నాడు. వారిని నమ్మటం వల్లే ఇలా జరిగిందని చెప్పినట్టు తెలుస్తుంది.

రహస్య పత్రాలు, ఫోటోలు, వీడియోలు సేకరించిన పాకిస్థానీ ఏజెంట్లు

రహస్య పత్రాలు, ఫోటోలు, వీడియోలు సేకరించిన పాకిస్థానీ ఏజెంట్లు

ఆర్మీ జవాన్ ను బాగా నమ్మించి సదరు మహిళలు రాణా నుండి రహస్య పత్రాలు, ఫోటోగ్రాఫ్‌లు, విన్యాసాల వీడియోలను కోరారు. దీంతో ఆర్మీ జవాన్ లపై జరుగుతున్న హనీట్రాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఒక్క ఆర్మీ జవాన్ పైనే హనీ ట్రాప్ జరిగిందా? లేదా ఇంకా ఎవరైనా ఇటువంటి వారు ఉన్నారా అన్నది తెలుసుకునే పనిలో పడింది భారత భద్రతా దళం.

English summary
Pakistani young women commit honeytrap on army jawan. Collected vital military information. Army jawan arrested for leaking military information.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X