ఆ పాడు పని చేసింది మేమే, అమెరికా కోసమే - అంగకీరించిన పాక్..!!
భారత్ తొలి నుంచి చెబుతుందే నిజమైంది. ఇప్పటి వరకు ఉగ్రవాదులతో తమకు సంబంధం లేదని చెబుతూ వచ్చిన పాకిస్థాన్ ఇప్పుడు నిజం ఒప్పుకొంది. ఉగ్రవాదులకు శిక్షణ నిజమేనని పాక్ విదేశాంగ శాఖ మంత్రి క్వాజా ఆసిఫ్ అంగీకరించారు. తాజాగా ఒక మీడియా సంస్థ ఇంటర్వ్యూ లో దీనికి కారణాలను వెల్లడించారు. అమెరికాతో పాటుగా మరి కొన్ని దేశాల కోసం తాము ఉగ్రవాదు లను పెంచి పోషించామని చెప్పుకొచ్చారు. అందుకు ఫలితం అనుభవిస్తున్నామన్నారు.
భారత్ చెప్పిందే
పాక్ ప్రభుత్వం ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందని భారత్ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. అనేక వేదికలపై దాయాది దేశం తీరును ఎండగడుతోంది. ఇవన్నీ అవాస్తవాలంటూ కొట్టి పారేస్తూ వచ్చిన పాక్ తొలిసారిగా తన బండారాన్ని బయటపెట్టుకుంది. అమెరికా కోసమే తాము ఉగ్రవాదు లకు శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని అంగకీరించింది. అగ్రరాజ్యంతో పాటు పాశ్చాత్య దేశాల కోసమే ఈ పాడు పని చేస్తున్నామని పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ తాజాగా పేర్కొన్నారు. ఇటీవలి పహల్గామ్ దాడికి పాక్‌దే బాధ్యత అని భారత్ తేల్చి చెప్పిన నేపథ్యంలో పాక్ మంత్రి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

30 ఏళ్లుగా ఈ పాడు పని
ఉగ్రవాదానికి పాక్ మద్దతుపై ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఖ్వాజా ఆసిఫ్ ఈ కామెంట్స్ చేశారు. ''అమెరికా, బ్రిటన్‌తో పాటు పాశ్చాత్య దేశాల కోసమే 30 ఏళ్లుగా ఈ పాడు పని చేస్తున్నాము'' అని అన్నారు. అయితే, ఈ తిప్పిదం వల్ల తాము చాలా నష్టపోయామని చెప్పారు. ''సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా యుద్ధంలో తాము భాగంగా కాకపోయి ఉంటే.. ఆ తరువాత 9/11 దాడులు.. ఇవన్నీ లేకపోయిన ఉంటే మా ట్రాక్ రికార్డుకు తిరుగే ఉండేది కాదు'' అని విశ్లేషించారు. సోవియట్ యూనియన్‌తో ప్రచ్ఛన యుద్ధం రోజుల్లో పాక్ అమెరికాకు వత్తాసు పలికిన విషయం తెలిసిందే. 9/11 దాడుల తరువాత అమెరికా ఆఫ్ఘనిస్థాన్‌ను ఆక్రమించుకోవడానికి కూడా పాక్ మద్దతు పలికింది. ఆ తరువాత పాక్ ను ప్రపంచ దేశాలు ఏకాకిని చేసాయి.
భారత్ సీరియస్
తాజాగా పహల్గామ్ ఘటనతో భారత్ సీరియస్ అయింది. ఉగ్రవాదులను.. వారి వెనుక ఉన్నవారిని వదిలేది లేదని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. అన్ని పార్టీలకు కేంద్రానికి సంఘీభావం ప్రకటిస్తూ ఏ నిర్ణయం తీసుకున్నా.. మద్దతిస్తామని హామీ ఇచ్చాయి. అటు సరిహద్దుల్లో పాకిస్థాన్ సైనికులను మొహరిస్తోంది. ఇటు ఉగ్రవాదుల ఏరివేత కోసం భారత సైన్యం కూంబింగ్ మొదలు పెట్టింది. ఈ రోజు జరిగిన ఎదురు కాల్పుల్లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం అయ్యాడు. ఉగ్రదాడిలో పాల్గొన్న వారి కోసం సైన్యం వేటాడుతోంది. ఇటు, భారత త్రివిధ దళాలు అప్రమత్తం అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా దౌత్య పరంగా పాక్ ను ఒంటరి చేసేందుకు భారత్ అన్ని ప్రయత్నాలు చేస్తూ.. ఇటు సైనిక చర్యకు సిద్దం అవుతోంది. ఈ సమయంలో పాక్ తమ నిజ స్వరూపం అంగీకరించటం తో భారత్ నిజం చెప్పందే నిజమని నిర్ధారణ అయింది.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications