ఆధార్‌తో పాన్ లింక్ కాలేదా.. మరికొద్ది రోజుల్లో ఆ కార్డులు చెల్లవు..!
ఢిల్లీ : ఆధార్ కార్డుతో మీ పాన్ కార్డు లింక్ కాలేదా. అయితే వెంటనే అలర్ట్ అవాల్సిందే. ఆగస్టు 31లోగా పాన్‌కార్డును ఆధార్‌తో లింక్ చేసుకోని పక్షంలో రద్దయ్యే ఛాన్సుంది. ఇంకా 50 రోజులు గడువు ఉండటంతో చివరి క్షణంలో హడావిడి పడకుండా ముందుగానే లింక్ చేసుకుంటే బెటర్. ఒకవేళ గడువు తేదీలోగా లింక్ చేయకుంటే మాత్రం ఆ పాన్ కార్డులు ఇకపై చెల్లవు. ఆ మేరకు తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ అధికారి ఒకరు వెల్లడించారు.
ఆధార్‌తో లింక్ లేని పాన్‌కార్డులు దాదాపు 20 కోట్ల వరకు ఉన్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా 43 కోట్ల మందికి పాన్‌కార్డులు ఉన్నాయని.. అందులో యాభై శాతం మాత్రమే ఆధార్‌తో లింకింగ్ కలిగి ఉన్నారని చెప్పుకొచ్చారు. ఆగస్టు 31వ తేదీలోగా అనుసంధానం చేసుకోవాలని సూచించారు.

క్రెడిట్ కార్డులతో పాటు వివిధ రుణాలు పొందడానికి చాలామంది చట్టవిరుద్దంగా పాన్‌కార్డులు ఉపయోగించినట్లు బయటపడటంతో.. ఆధార్ కార్డుతో లింక్ చేయని పాన్ కార్డులను రద్దు చేయాలని ఐటీ డిపార్టుమెంట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఆగస్టు 31లోగా లింక్ చేసుకోకుంటే.. ఆ పాన్‌కార్డులు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి చెల్లవు. అదలావుంటే బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. పాన్ కార్డు లేకున్నా ఆధార్ కార్డుతో పన్ను చెల్లించే సౌలభ్యం ఉంటుందని చెప్పడం కొసమెరుపు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications