రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే:పన్నీర్, ఢిల్లీ కేంద్రంగా ఏం జరిగింది?

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం విషయంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే (తలైపురుచ్చి అమ్మ) వర్గం నాయకుడు పన్నీర్ సెల్వం స్పందించారు. రజనీకాంత్ చాల మంచి మనిషి, ఆయనకు ఎలాంటి చెడ్డపేరు లేదని అన్నారు.

రజనీకాంత్ కు ప్రజల సమస్యల గురించి మంచి అవగాహన ఉందని పన్నీర్ సెల్వం అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు రాజకీయ పార్టీల పరంగా, వ్యక్తిగతంగా, సినీరంగంలో రజనీకాంత్ కు ఎలాంటి వైర్యం లేదని, అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తి అని పన్నీర్ సెల్వం ఢిల్లీలో మీడియాకు చెప్పారు.

మాకు ఎలాంటి నష్టం లేదు

మాకు ఎలాంటి నష్టం లేదు

రజనీకాంత్ రాజకీయాల్లో రావడానికి అర్హుడే అని పన్నీర్ సెల్వం చెప్పారు. అయితే రాజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చినా అన్నాడీఎంకే మీద ఎలాంటి ప్రభావం చూపించదని, మా కార్యకర్తలు మాకు ఉంటారని పన్నీర్ సెల్వం ధీమా వ్యక్తం చేశారు.

రజనీకాంత్ కు ఇష్టం ఉంటే ?

రజనీకాంత్ కు ఇష్టం ఉంటే ?

రజనీకాంత్ కు తమిళనాడులో కోట్లలో అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఆయనకు ఎలాంటి అడ్డింకి లేనప్పుడు రాజకీయాల్లో రావడం సబబే అని పన్నీర్ సెల్వం అన్నారు. అయితే రాజకీయాల్లోకి రావాల ? వద్దా అనే విషయంపై రజనీకాంత్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

నో కామెంట్

నో కామెంట్

రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడంపై ఇతరులు చేస్తున్న కామెంట్లపై తాను స్పందించనని పన్నీర్ సెల్వం అన్నారు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. అది వారి వ్యక్తిగతం తాను ఈ విషయంపై స్పందించడం భావ్యం కాదని, తన అభిప్రాయం తాను చెప్పానని పన్నీర్ సెల్వం మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

ఢిల్లీలోనే రజనీకాంత్ విషయంలో ?

ఢిల్లీలోనే రజనీకాంత్ విషయంలో ?


రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం విషయంలో క్లారిటీ ఇచ్చే రోజే పన్నీర్ సెల్వం ఢిల్లీలో మకాం వేశారు. అంతే కాకుండా కేంద్రంలోని పెద్దలతో పన్నీర్ సెల్వం మంతనాలు జరుపుతున్నారు. రజనీకాంత్ రాజకీయరంగ ప్రవేశం విషయంలో పన్నీర్ సెల్వం ఢిల్లీలోనే స్పందించారు.

 రజనీకాంత్ గురించి ఆచితూచి !

రజనీకాంత్ గురించి ఆచితూచి !

రజనీకాంత్ విషయంలో పన్నీర్ సెల్వం ఆచితూచి మీడియాతో మాట్లాడారు. ఎక్కడ నోరు జారకుండా జాగ్రత్త పడ్డారు. రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై అనేక మంది ఆయన మీద విమర్శలు చేస్తున్నా పన్నీర్ సెల్వం మాత్రం ఆయన రాజకీయాల్లోకి రావడం మంచిదే అనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఒకే రోజు తమిళనాడు రాజకీయాల్లో

ఒకే రోజు తమిళనాడు రాజకీయాల్లో

పన్నీర్ సెల్వం ఢిల్లీలో ప్రధాని మోడీతో భేటీ అవుతున్నారు. అదే రోజు తన రాజకీయ రంగ ప్రవేశం విషయంలో రజనీకాంత్ ఏదో ఒక నిర్ణయం వెల్లడించడానికి సిద్దం అయ్యారు. రజనీకాంత్ కొత్త పార్టీ పెడితే తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిపోనున్నాయి.

ఓటు బ్యాంకు కోసం ఇలా !

ఓటు బ్యాంకు కోసం ఇలా !

రజనీకాంత్ అభిమానులకు దగ్గర కావడానికి పన్నీర్ సెల్వం ప్రయత్నించారని సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో రజనీకాంత్ అభిమానుల ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకుని శశికళ వర్గానికి గట్టి దెబ్బ కొట్టాలని పన్నీర్ సెల్వం పక్కా ప్లాన్ తో మాట్లాడారని ఆయన మాటల్లో స్పష్టంగా తెలుస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Rajinikanth is a good human being and there is nothing wrong in his entering politics. But his entry will not make difference to the AIADMK, Tamil Nadu former CM Panneerselvam said.
Please Wait while comments are loading...