ప్రధాని మోడీతో పన్నీర్ సెల్వం భేటీ, విలీనంపై చర్చ, కీలక ప్రకటన చేసే అవకాశం !

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సోమవారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు.

న్యూఢిల్లీ: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సోమవారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. అన్నాడీఎంకే పార్టీలోని రెండు వర్గాలు కలిసిపోవడానికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ సలహాలు, సూచనలు తీసుకోవడానికి పన్నీర్ సెల్వం ఆయన్ను కలిశారని తెలిసింది.

పన్నీర్ సెల్వం వెంట ఆయన సన్నిహితులు కేపీ. మునిసామి, సమ్మలై, మైత్రేయన్ తదితరులు ప్రధానితో భేటీ అయ్యారు. పదవుల పందెరం విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి మెట్టు దిగడం లేదనే విషయంపై చర్చించారని తెలిసింది.

 Paneerselvam team met Prime minister Narendra Modi at Delhi

ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ తరువాత పన్నీర్ సెల్వం ఏలా స్పంధిస్తారు ? అంటూ తమిళనాడుతో సహ దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. పళనిసామి వర్గంతో కలిసిపోయిన తరువాత తన అనుచరులకు ప్రభుత్వంలో కీలక మంత్రి పదవులతో పాటు తనకు పార్టీ పగ్గాలు అప్పగించాలని పన్నీర్ సెల్వం డిమాండ్ చేసే అవకాశం ఉందని తెలిసింది. పన్నీర్ సెల్వం ఎలాంటి ప్రకటన చేస్తారో ? అంటూ పళనిసామి వర్గం సైతం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+