వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శశికళకు ఇలా చెక్!: ఎమ్మెల్యేలపై వేటు, పన్నీరు కొత్త పార్టీ!

మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అమ్మా డీఎంకే అనే పేరుతో ఆయన కొత్త పార్టీ ప్రకటించే అవకాశాలున్నాయని అంటున్నారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అమ్మా డీఎంకే అనే పేరుతో ఆయన కొత్త పార్టీ ప్రకటించే అవకాశాలున్నాయని అంటున్నారు.

శనివారం నాడు ముఖ్యమంత్రి పళనిస్వామి బలనిరూపణ చేసుకున్నారు. 134 మంది ఎమ్మెల్యేలకు 122 మంది ఆయనకు మద్దతు తెలిపారు. మరో పదకొండు మంది ఎమ్మెల్యేలు పన్నీరు వైపు నిలిచి.. పళనికి వ్యతిరేకంగా ఓటు వేశారు.

పార్టీ విప్ ధిక్కరించి.. పన్నీరుతో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఓటు వేసిన 11 మందిపై స్పీకర్ అనర్హత వేటు వేయనున్నారు. ఈ నేపథ్యంలో వేరే పార్టీలో చేరలేక కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

<strong>గవర్నర్‌ను కలిసిన పళని: శశికళను రప్పించేందుకు సీఎం పావులు?</strong>గవర్నర్‌ను కలిసిన పళని: శశికళను రప్పించేందుకు సీఎం పావులు?

Panneerselvam may float party with AMMA name

పన్నీర్‌తో సహా 11మందిని స్పీకర్ బహిష్కరించి, ఆరునెలల్లోగా ఎన్నికలు జరిపే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. దీంతో ఆరునెలల్లో ఎన్నికల్లో పోటీ చేయాలంటే పన్నీర్‌కు ఉన్నటువంటి ఏకైక మార్గం పార్టీ పెట్టడంగానే కనిపిస్తోంది.

ఉమ్మడి గుర్తుతో పోటీ చేయడంపై ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. అన్నాడీఎంకే స్థానంలో అమ్మాడీఎంకే పార్టీ పెట్టాలని ఆయన ఆలోచన చేస్తున్నారట. దీనికి సంబంధించి ఈసీతో సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం.

జయకు నిజమైన వారసుడిని తానేనని చెప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నారని, అందుకే అమ్మ పేరుతోనే పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లే ఆలోచనలో పన్నీర్ సెల్వం ఉన్నట్లుగా సమాచారం. అన్నాడీఎంకేకు పోటీగా అమ్మాడీఎంకే పార్టీని పెట్టడం ద్వారా శశికళకు చెక్ చెప్పవచ్చునని పన్నీరు వర్గం భావిస్తోంది.

English summary
Former Chief Minister Panneerselvam may float new party with AMMA (jayalalithaa) name.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X