జయ మృతిపై శశికళకు షాక్: దీప మద్దతు తీసుకుంటామన్న సెల్వం

అన్నాడీఎంకే పార్టీ పదవుల నుంచి తప్పించే అధికారం ఎవరికీ లేదని తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం స్పష్టం చేశారు. బుధవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు.

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ పదవుల నుంచి తప్పించే అధికారం ఎవరికీ లేదని తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం స్పష్టం చేశారు. అమ్మ(జయలలి) తనను పార్టీ కోశాధికారిని చేశారని అన్నారు. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ.. పన్నీరు సెల్వంను ఆ పార్టీ కోశాధికారి పదవి నుంచి తప్పించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ శశికళపై తిరుగుబాటును ప్రకటించారు. ముఖ్యమంత్రి పదవికి చేసిన రాజీనామా వెనక్కి తీసుకునే పరిస్థితి వస్తే తీసుకుంటానని అన్నారు.తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిప్డారు. పార్టీని తానెప్పుడు వ్యతిరేకించలేదని అన్నారు.

పన్నీరు రె'ఢీ': నేటి వార్తలు మరిన్ని..

ఎంజీఆర్‌.. జయలలిత తమిళనాడుకు ఎంతో సేవ చేశారని.. వారి బాటలోనే తానూ నడుస్తానన్నారు. శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శి మాత్రమేనని.. త్వరలోనే ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీ శాశ్వత ప్రధాన కార్యదర్శిని ఎన్నుకుంటామని పన్నీర్‌ సెల్వం తెలిపారు.

Panneerselvam on Sasikala decision

ఇప్పటి దాకా పార్టీకి ఎప్పుడూ ద్రోహం చేయలేదని అన్నారు. పార్టీ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమని తేల్చి చెప్పారు. అధికారం ఉన్నా లేకపోయినా పార్టీకి ఎప్పుడు ద్రోహం చేయలేదన్నారు. తనపై ఆరోపణలకు కాలమే సమాధానం చెబుతుందని వ్యాఖ్యానించారు.

జమ మృతిపై అనుమానాలు: సుప్రీం జడ్జీతో విచారణ

జయ మృతిపై అనుమానాలున్నాయని.. సుప్రీంకోర్టు న్యాయమూర్తితో జయలలిత మృతిపై విచారణ జరిపిస్తామని అన్నారు. జయ మృతిపై ప్రజలకు వాస్తవాలు తెలియాలని అన్నారు. కాగా, ఇంతకుముందే ఆయన విచారణ కమిటీతో దర్యాప్తునకు ఆదేశాలు కూడా జారీ చేయడం గమనార్హం. కాగా, తన నిర్ణయాలతో బీజేపీకి సంబంధం లేదని అన్నారు.

శశికళకు సవాల్: దీప మద్దతు

అన్నాడీఎంకేను కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని పన్నీరుసెల్వం చెప్పారు. అన్నాడీఎంకే కోసం జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ తమతో కలిసి రావాలని పన్నీరు సెల్వం పిలుపునిచ్చారు. దీప మద్దతు తీసుకుటామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో బల నిరూపణకు తాను సిద్ధమంటూ శశికళకు సెల్వమ్ సవాల్ విసిరారు. మెజార్టీ ప్రభుత్వాన్ని తానే నడిపిస్తానని స్పష్టం చేశారు.

గవర్నర్ వచ్చిన వెంటనే తాను కలుస్తానని చెప్పారు. బలనిరూపణ కోసం గడువు అడుగుతానని చెప్పారు. శాసనసభ జరిగితే తనకు మద్దతిచ్చే సభ్యుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని చెప్పారు. రాజ్యంగ విధులకు లోబడే గవర్నర్ నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రమంతా తిరిగి ప్రజలకు వాస్తవాలు చెబుతానని అన్నారు. కేంద్రం తమిళ ప్రజలకు మద్దతుగా ఉందని చెప్పారు. అన్నాడీఎంకే పార్టీకి శశికళ తాత్కాలిక జనరల్ సెక్రటరీ మాత్రమేనని స్పష్టం చేశారు. పార్టీ ఏకతాటిపై ఉండేలా కృషి చేస్తానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+