ఎంపీలకు 100% హైక్: మనవళ్లకు హెల్త్ బెనిఫిట్స్
న్యూఢిల్లీ: పార్లమెంట్ సభ్యుల వేతనాన్ని వంద శాతం రెట్టింపు చేయాలని బీజేపీ ఎంపీ యోగీ ఆదిత్యనాథ్ నేతృత్వంలోని సంయుక్త పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసింది. ప్రతిసారీ ఇలా వేతనాన్ని సిఫారసు చేసేకంటే వేతన సంఘం ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుందని కమిటీ అభిప్రాయపడింది.
వంద శాతం వేతన రెట్టింపుతో పాటు ఎంపీల పింఛనును రూ. 20,000 నుంచి రూ. 50,000 వేలకు పెంచాలని కమటీ సూచించింది. ఇక మాజీ ఎంపీల ఫించనును 75 శాతం పెంచాలని కమిటీ సిఫారసు చేసింది.
ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఎంపీలకు డీఏ ఉండదని, అసలు ఉద్యోగుల తరహాలో తమకు కూడా వేతన సంఘం పీఆర్సీ ఒకటి ఉంటే క్రమం తప్పకుండా జీతాలు పెరుగుతాయని కమిటీ అభిప్రాయపడింది. ఎంపీల జీతాలు పెంపుదల కోసం ఎంపీ యోగీ ఆదిత్యనాథ్ నేతృత్వంలో ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ 60 సిఫారసులు చేసింది.

సంయుక్త పార్లమెంటరీ కమిటీ చేసిన 60 సిఫారసుల్లో ముఖ్యమైనవి ఇవే:
* పార్లమెంట్ సమావేశాలకు హాజరైన రోజుల్లో రోజుకు రూ. 2 వేలు దినసరి భత్యం తీసుకుంటారు.
* ప్రస్తుతం ఎంపీలకు నెలసరి రూ. 50 వేలు జీతంగా వస్తుండగా దానిని రూ. 80.01లకు పెంచాలని కమిటీ సూచించినట్లు సమాచారం.
* అయితే కొందరు ఎంపీలు వేతనాన్ని రూ. లక్ష చేయాలని కమిటీకి సూచించినట్లు సమాచారం.
* 2010లో ఎంపీల వేతనాలు పెరిగాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంపీల వేతనాలు పెరగలేదని కమిటీ తెలిపింది.
* మాజీ ఎంపీలకు ప్రభుత్వం రూ. 20, 000 ఫించను ఇస్తోంది. 5ఏళ్లకు పైగా ఎంపీగా సేవలు అందిస్తే వారికి రూ. 21,500లు ఫించనుగా ఇస్తున్నారు.
* దీనిని ఇకపై రూ.35, 000లుగా చేయాలని కమిటీ సిఫారసు చేసింది.
* ఎంపీలకు ఏడాదికి 20 నుంచి 25 వరకు ఉచిత విమాన ప్రయాణాల సౌలభ్యం కల్పించాలని కమిటీ సూచించింది.












Click it and Unblock the Notifications