డ్రామా బంద్ కరో..: వెనక్కి తగ్గిన పేటీఎం, క్షమాపణ

న్యూఢిల్లీ: రూ.500, రూ.1000 నోట్ల రద్దు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. నగదు మార్చుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున బ్యాంకుల వద్ద క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో దీనిని మార్కెట్ చేసుకునేందుకు పేటీఎం తాజాగా ఓ అడ్వర్టయిజ్‌మెంటును రూపొందించింది.

ఇది ప్రజలను కించపరిచేలా ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నోట్ల మార్పిడి కోసం ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూ కడుతుంటే వారిని కించపరిచేలా అడ్వర్టయిజ్ చేయడం ఏమిటని నిప్పులు చెరిగారు.

'డ్రామా బంద్ కరో.. పేటీఎం కరో' అని తాజా యాడ్. ఇది ప్రజలను అవమానించేలా ఉందని నెటిజన్లు దుమ్మెత్తి పోశారు. దీంతో పేటీఎం తగ్గింది. ఈ యాడ్ పైన క్షమాపణలు కోరింది. ప్రజలందర్నీ అభివృద్ధిలో భాగస్వామ్యం చేసే విషయంలో తమకు నమ్మకం ఉందని మరో వీడియోను విడుదల చేసింది.

Paytm takes its ad down after being trolled on social media

కాగా, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నోట్ల మార్పిడి, విత్‌డ్రా పరిమితిని పెంచిన విషయం తెలిసిందే. బ్యాంకుల వద్ద ప్రజలు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేశారు. బ్యాంకులో రోజుకు ఎన్నిసార్లైనా నగదు జమ చేసుకోవచ్చని, దీనికి ఎలాంటి పరిమితి లేదని తెలిపారు.

అయితే రూ.2.50లక్షలు, ఆపై డిపాజిట్లకు మాత్రం ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ఉప తపాలా కార్యాలయాల్లోనూ నగదు డిపాజిట్‌కు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. నగదు ఉపసంహరణ పరిమితిని రూ.24వేలకు పెంచారు.

దీనిని ఒకేరోజులో తీసుకోవచ్చు. దేశవ్యాప్తంగా కొత్త రూ.500నోట్లు నిన్నటి నుంచే ఏటీఎంలలో అందుబాటులో ఉంచారు. పెట్రోల్‌ బంకులు, మందుల దుకాణాలు, పన్నుల చెల్లింపులు, ఎయిర్ పోర్టులు, రైల్వే స్టేషన్లలో పాతనోట్ల చెలామణి చేసుకునే అవకాశాన్ని నవంబర్‌ 24 వరకు పొడిగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+