Haryana Exit Polls 2024: హర్యానా విజేత ఎవరో తేల్చేసిన పీపుల్స్ పల్స్- 55 సీట్లతో అధికారం..!

హర్యానాలో ఇవాళ జరిగిన అసెంబ్లీ ఎన్నికలపై పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్ విడుదల చేసింది. ఇందులో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగినప్పటికీ విజేత ఎవరో మాత్రం స్పష్టంగానే చెప్పేసింది. అలాగే విజేతకు లభించే సీట్లు, ఓట్ల శాతాల్ని కూడా ఎక్స్ లో ట్వీట్ చేసింది. అలాగే హర్యానాలో చిన్న పార్టీలు ఏ మేరకు ప్రభావం చూపాయో కూడా గణాంకాలతో సహా వివరించింది.

పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ ప్రకారం 90 సీట్లున్న హర్యానా అసెంబ్లీలో 55 సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకోబోతోందని తేలింది. బీజేపీకి 26 సీట్లు లభిస్తాయని, ఐఎన్ఎల్డీ-బీఎస్పీ కూటమికి 2-3 సీట్లు, జేజేపీ కూటమికి 0-1, స్వతంత్రులకు మరో 3-5 సీట్లు దక్కుతాయని అంచనా వేసింది. కాంగ్రెస్ పార్టీ ఏకంగా 45 శాతం ఓట్లను సాధించబోతోందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ తేల్చింది. అలాగే బీజేపీకి కేవలం 38 శాతం ఓట్లు దక్కుతాయని తెలిపింది. ఇతర పార్టీలు మిగతా ఓటు షేర్ ను పంచుకోనున్నట్లు ఎగ్జిట్ పోల్ వెల్లడించింది.

Peoples Pulse Exit Poll predicts congress party will clinch Haryana with 55 seats

హర్యానా అసెంబ్లీలో మొత్తం 90 సీట్లు ఉండగా.. దాదాపు వెయ్యి మంది అభ్యర్ధులు ఈ ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకుంటున్నారు. దాదాపు రెండు కోట్ల మంది ఓటర్లు ఈసారి ఎన్నికల్లో ఓటేశారు. కాంగ్రెస్, బీజేపీ, జేజేపీ-ఏఎస్పీ, ఐఎన్ఎల్డీ-బీఎస్పీ, ఆప్ ప్రధానంగా పోటీలో ఉన్నాయి. ఈ నెల 8న హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.

Peoples Pulse Exit Poll predicts congress party will clinch Haryana with 55 seats
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+