పార్లమెంట్ సమక్షానికి డేటా ప్రొటెక్షన్ బిల్లు: కీలక విషయాలివే
న్యూఢిల్లీ: దేశ ప్రజల వ్యక్తిగత సమాచారం, డేటాకు మరింత రక్షణ కల్పించడానికి ఉద్దేశించిన 'పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు-2019' ముసాయిదా పార్లమెంట్ సమక్షానికి వచ్చింది. ఈ కమిటీకి పీపీ చౌదరి సారథ్యాన్ని వహించారు. రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు, కేంద్ర మాజీమంత్రి జైరామ్ రమేష్, లోక్‌సభలో భారతీయ జనతా పార్టీ సభ్యుడు పీపీ చౌదరి.. దీన్ని ఉభయ సభల్లో ప్రవేశపెట్టారు. 2019లో రూపొందించిన బిల్లు ఇది. దీన్ని రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం 30 మంది సభ్యులతో కూడిన ఈ ప్యానెల్ కమిటీని ఏర్పాటు చేసింది.

తీవ్ర గందరగోళ పరిస్థితుల మధ్య..
పార్లమెంట్ ఉభయ సభల్లో అధికార, ప్రతిపక్ష సభ్యుల పెద్ద ఎత్తున వాగ్వివాదం చోటు చేసుకుంటోంది. వేర్వేరు పార్టీలకు చెందిన 12 మంది సభ్యులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తి వేయాలంటూ రాజ్యసభలో డిమాండ్ వినిపిస్తోంది. రాజ్యసభ సమావేశాలు ఆరంభమైనప్పటి నుంచీ సభలో ఈ ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. లఖింపూర్ ఖేరీ ఉదంతంపై కేంద్ర హోం శాఖ సహాయమంత్రి అజయ్ కుమార్ మిశ్రా తేనిపై చర్యలు తీసుకోవాలంటూ లోక్‌సభలో డిమాండ్ కొనసాగుతోంది. ఈ గందరగోళ వాతావరణం మధ్యే పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు ఉభయసభల ముందుకు వచ్చింది.

సోషల్ మీడియాను నియంత్రించేలా
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్, కంపెనీలను నియంత్రించాలంటూ ఈ కమిటీ సిఫారసు చేసింది. సోషల్ మీడియాను నియంత్రించడానికి ప్రత్యేకంగా రెగ్యులేటరీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సూచించింది. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్ వంటి కంపెనీలు భారత్‌లో పూర్తిస్థాయిలో తమ కార్యాలయాలను నెలకొల్పుకొనేంత వరకు, వాటిని ఆపరేట్ చేసుకోనివ్వకూడదని పేర్కొంది. సోషల్ మీడియా అకౌంట్స్‌ను తప్పనిసరిగా పరిశీలించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది.

ఆ పోస్టులకు యాజమాన్యానిదే బాధ్యత..
సోషల్ మీడియా యూజర్ల అకౌంట్లను వెరిఫై చేయకపోతే.. అందులో పోస్ట్ అయ్యే సమాచారానికి పూర్తి బాధ్యతను సంబంధిత కంపెనీ యాజమాన్యమే వహించాల్సి ఉంటుందని జాయింట్ పార్లమెంటరీ కమిటీ.. తన నివేదికలో కుండబద్దలు కొట్టింది. ఆ పోస్టులకు యాజమాన్యమే సమాధానం ఇచ్చుకోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. తొలిసారిగా ఈ బిల్లును 2019లో పార్లమెంట్ ఉభయ సభల ముందకు తీసుకొచ్చింది ప్రభుత్వం. అప్పట్లో ఇది సభ ఆమోదం పొందలేదు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. దీనితో పీపీ చౌదరి నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటైంది.

దర్యాప్తు సంస్థలకు మినహాయింపు..
దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, విజిలెన్స్, ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ వంటి విభాగాలకు ఇందులో నుంచి మినహాయింపు ఇచ్చింది కమిటీ. దేశ ప్రజల వ్యక్తిగత సమాచారం, డేటాకు రక్షణ కల్పించడం, దీనికోసం ఆధార్ తరహాలో ఓ ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాల్సి ఉంటుందనీ సిఫారసు చేసింది. దీనిపై పలువురు విపక్ష ఎంపీలు తమ అసమ్మతి తెలుపుతూ జేపీసీ చైర్మన్ చౌదరికి లేఖ రాశారు.
Recommended Video

డేటా ప్రొటెక్షన్ అధికారికి హక్కులు..
పర్సనల్ డేటా ప్రొటెక్షన్ అధికారికి కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని, అతను లేదా ఆమెకు సర్వ హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది. కంపెనీ మేనేజ్‌మెంట్ లేదా ఇతర విభాగాల్లో డేటా ప్రొటెక్షన్ అధికారికి హక్కులు కల్పించాల్సి ఉంటుందని పేర్కొంది. డేటాను దుర్వినియోగం చేసిన వారిపై లింగభేదం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. సంబంధిత వ్యక్తి అనుమతి లేకుండా అతను లేదా ఆమె డేటాను ప్రాసెస్ చేసే వీలు ఉండకూడదని సిఫారసు చేసింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications