వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పర్వేజ్ ముషారఫ్: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు మృతి

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
పర్వేజ్ ముషరఫ్‌

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ మృతిచెందినట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ వెల్లడించింది.

జనరల్ పర్వేజ్ ముషారఫ్ మృతికి పాకిస్తాన్ సైన్యం సంతాపం తెలిపింది. ఈ మేరకు పాకిస్తాన్ సైన్యం ముషారఫ్ మరణవార్తను 'బీబీసీ’ ప్రతినిధి షుమైలా జాఫ్రీకి ధ్రువీకరించింది.

చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొంత కాలంగా దుబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఆయన చనిపోయారు.

1943 ఆగస్ట్ 11న బ్రిటిష్ ఇండియాలోని దిల్లీలో జన్మించిన ముషారఫ్ 1998లో జనరల్ ర్యాంక్‌కు ఎదిగారు. అనంతరం చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఆఫ్ పాకిస్తాన్‌ పదవి చేపట్టారు.

అనంతరం అధికారాన్ని హస్తగతం చేసుకుని పాకిస్తాన్ అధ్యక్షుడయ్యారు.

https://twitter.com/ANI/status/1622113222533971968

జనరల్ పర్వేజ్ ముషరఫ్ 1999 అక్టోబర్‌లో సైనిక తిరుగుబాటుతో పాకిస్తాన్‌లో అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు.

2001 జూన్‌లో ముషరఫ్ ఆర్మీ చీఫ్‌గా ఉన్నప్పుడు తనను తాను అధ్యక్షుడుగా ప్రకటించుకున్నారు.

2002 ఏప్రిల్‌లో ఒక వివాదాస్పద జనాభిప్రాయ సేకరణ ద్వారా ముషరఫ్ మరో ఐదేళ్లు అధ్యక్షుడిగా కొనసాగారు.

2007 అక్టోబర్-నవంబర్‌లో ఆయన మళ్లీ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు.

కానీ ఆయన ఎన్నికలను సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఆ తర్వాత ముషరఫ్ దేశంలో అత్యవసర స్థితి విధించారు.

చీఫ్ జస్టిస్ ఇఫ్తికార్ చౌధరి స్థానంలో కొత్త చీఫ్ జస్టిస్‌ను నియమించారు. ఆయన ముషరఫ్ ఎన్నికకు ఆమోదముద్ర వేశారు.

2008 ఆగస్టులో ముషరఫ్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

అధికారంలో ఉన్న రెండు ప్రముఖ పార్టీలు తనకు వ్యతిరేకంగా మహాభియోగ తీర్మానం తీసుకురావాలని ఏకాభిప్రాయానికి రావడంతో పదవి నుంచి దిగిపోవాలని నిర్ణయించారు.

దేశ ద్రోహం కేసులో మరణశిక్ష

దేశద్రోహం కేసులో ఇస్లామాబాద్‌లోని ప్రత్యేక న్యాయస్థానానికి చెందిన ముగ్గురు సభ్యుల ప్రత్యేక బెంచ్ 2019లో ముషారఫ్‌కు మరణశిక్ష విధించింది.

ముషారఫ్ మరణించినట్లు గతంలో పలుమార్లు వదంతులు వ్యాపించాయి.

అములాయ్‌డోసిస్ అనే వ్యాధితో ఆయన బాధపడుతున్నట్లు కుటుంబసభ్యులు అప్పట్లో తెలిపారు.

'డెమొక్రసీతో ఏం లాభం’

ప్రజల కోసం పనిచేయని డెమొక్రసీతో లాభం లేదని, పాకిస్తాన్‌ సైనిక పాలనలోనే అభివృద్ధి చెందిందని ముషారఫ్ గతంలో 'బీబీసీ’తో చెప్పారు.

'అయూబ్ ఖాన్ పాలన అయినా, నా పాలన అయినా పాకిస్తాన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆరోగ్యం, విద్య అన్ని రంగాల్లో మంచి అభివృద్ధి సాధించింది. ఇప్పుడు ఎవరూ వినడానికి సిద్ధంగా లేకపోతే ఏం చేయాలి. డెమాక్రసీ-డెమాక్రసీ. డెమాక్రసీతో మనం ఏం చేయాలి. ప్రజల కోసం పనిచేయని డెమాక్రసీ ఉండి ఏం లాభం?’ అని ఆయన 2019లో బీబీసీ హిందీతో మాట్లాడినప్పుడు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Pervez Musharraf: Former President of Pakistan passed away
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X