వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వరుసగా 12వ రోజూ తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు: ఎంతంటే?
న్యూల్లీ: వరుసగా పన్నెండో రోజ కూడా పెట్రోల్ ధరలు తగ్గాయి. లీటర్ పెట్రోల్‌పై ఢిల్లీ, కోల్‌కతాలో ఆదివారం 24పైసలు తగ్గగా.. చెన్నైలో 26పైసలు, ముంబైలో 23పైసలు తగ్గింది.
వరుసగా పన్నెండో రోజు కూడా తగ్గడంతో ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.76.78, ముంబైలో రూ.84.61 గా ఉంది. దీంతో ఇప్పటి వరకూ పెట్రోల్ ధరలు లీటరుపై ఢిల్లీలో రూ.1.65, కోల్‌కతాలో రూ.1.62, ముంబైలో రూ.1.63, అత్యధికంగా చెన్నైలో రూ.1.74 తగ్గింది.

డీజిల్ ధరలు కూడా ఆదివారం 18పైసలు వరకూ తగ్గాయి. ముంబై, చెన్నైలో 19 పైసలు తగ్గాయి. దీంతో లీటరు డీజిల్ ధర రూ. 68.10, కోల్‌కతాలో రూ.70.65, ముంబైలో రూ. 72.51, చెన్నైలో రూ. 71.89కు చేరింది. కాగా, శనివారం రికార్డు స్థాయిలో లీటరు పెట్రోల్‌పై 40-42 పైసలు తగ్గిన విషయం తెలిసిందే.