పెట్రో మంట: లీటర్ పెట్రోల్ 101.. ఇక్కడే...
ఇందనం ధర వినియోగదారులకు చుక్కలు చూపిస్తోంది. వరుసగా ధర పెరుగుతోంది. లీటరు పెట్రోల్ ధర 100 రూపాయలు దాటేసింది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో 38 పైసల పెట్రో ధర పెంపుతో ప్రీమియం పెట్రోల్ ధర లీటరుకు రూ.101.80కు చేరుకుంది. రాజధాని జైపూర్‌లో లీటరు పెట్రోలు ధర రూ .93.86, డీజిల్ ధర 85.94 చేరింది. రాజస్థాన్ వ్యాప్తంగా పెట్రోల్ 93 రూపాయలకు ఎగువన, డీజిల్ ధర రూ.85 కంటే హైగానే ఉంది.
ఇవాళ ఢిల్లీలో సాధారణ పెట్రోలు రూ. 86.30, లీటర్ డీజిల్ ధర రూ. 76.48 ఉంది. ఇక చెన్నైలో పెట్రోలు ధర లీటరుకు రూ. 88.82, డీజిల్ ధర రూ. 81.71 ఉంది. హైదరాబాద్‌లో పెట్రోలు ధర లీటరుకు రూ. 89.77, డీజిల్ ధర రూ. 83.46 ఉంది. ఇటు ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు ధర లీటరుకు రూ. 92.54. డీజిల్ ధర రూ. 85.73గా ఉంది.

వ్యాట్‌లో తేడాల వల్ల ఆయా రాష్ట్రాల్లో పెట్రో ధర డిఫరెంట్‌గా ఉంది. 2020 మేలో రాజస్థాన్ ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం డీజిల్ ధరలపై వ్యాట్ 28 శాతం ఉండగా, పెట్రోల్‌పై వ్యాట్ 38 శాతంగా ఉంది. పొరుగు రాష్ట్రాల్లో పెట్రోల్‌పై 20 శాతం నుంచి 33 శాతం, డీజిల్‌పై 16 శాతం నుంచి 23 శాతం వ్యాట్ అమల్లో ఉంది. రాజస్థాన్‌లో ఇతర రాష్ట్రాల కంటే పెట్రోల్, డీజిల్ 4-8 నుంచి 10-11 రూపాయలు ఎక్కువగా ఉంది.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?












Click it and Unblock the Notifications