వరుసగా మూడోరోజూ పెరిగిన పెట్రోల్ ధరలు: ఢిల్లీలో లీటర్‌కి రూ.73

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరోసారి పెట్రోల్ ధరలు భగుమంటున్నాయి. పెట్రోల్‌పై 45 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ. 73కు చేరుకుంది. వరుసగా మూడో రోజు కూడా పెట్రోల్ ధరలు పెరగడం గమనార్హం. అయితే, డీజిల్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.

ఢిల్లీతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పెట్రోల్ ధరలు పెరిగాయి. ఆదివారం ముంబై, కోల్‌కతా, ఢిల్లీ నగరాల్లో పెట్రోల్ ధర 20 పైసలు పెరిగింది. చెన్నైలో మాత్రం 21పైసలు పెరిగాయి.

ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ప్రకారం.. పెట్రోల్ ధరలు ఇలా ఉన్నాయి. లీటర్ పెట్రోల్ ధర ఢిల్లీలో రూ. 73.05 ఉండగా, కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 75.76గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 78.72గా ఉంది.

Petrol prices soar above Rs 73/ltr for 3rd consecutive day in Delhi

ఇక చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర 75.92గా ఉంది. డీజిల్ ధరలో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ. 65.91 ఉండగా, కోల్‌కతాలో 68.32గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 69.13 కాగా, చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 69.67గా ఉంది.

హైదరాబాద్ నగరంలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ. 77.59 ఉంది. లీటర్ డీజిల్ ధర రూ. 71.79గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై 21పైసలు పెరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+