వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫోన్ ట్యాపరింగ్ ఉచ్చులో మాజీ సీఎం, బీజేపీకి కాంగ్రెస్ లీడర్స్ మద్దతు, ఐపీఎస్ లకు లింక్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలో ఫోన్ ట్యాపరింగ్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఫోన్ ట్యాపరింగ్ ఉచ్చులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి చిక్కుకునే అవకాశం ఉందని సమాచారం. ఫోన్ ట్యాపరింగ్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ డిమాండ్ చెయ్యడంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మద్దతు తెలపడంతో మాజీ సీఎం కుమారస్వామ అయోమయంలో పడిపోయారు. ఫోన్ ట్యాపరింగ్ విషయంలో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప సీరియస్ గా ఉన్నారు. అనేక మంది ఐపీఎస్ అధికారులకు ఫోన్ ట్యాపరింగ్ తో సంబంధం ఉందని తెలిసింది.

బెంగళూరు: కర్ణాటకలో ఫోన్ ట్యాపరింగ్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఫోన్ ట్యాపరింగ్ ఉచ్చులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి చిక్కుకునే అవకాశం ఉందని సమాచారం. ఫోన్ ట్యాపరింగ్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ డిమాండ్ చెయ్యడంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మద్దతు తెలపడంతో మాజీ సీఎం కుమారస్వామ అయోమయంలో పడిపోయారు. ఫోన్ ట్యాపరింగ్ విషయంలో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప సీరియస్ గా ఉన్నారు. అనేక మంది ఐపీఎస్ అధికారులకు ఫోన్ ట్యాపరింగ్ తో సంబంధం ఉందని తెలిసింది.

ఫోన్ ట్యాపరింగ్

ఫోన్ ట్యాపరింగ్

కర్ణాటక అనర్హత ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో సహ అనేక మంది నాయకుల ఫోన్ ట్యాపరింగ్ చేయించిన మాజీ సీఎం హెచ్.డి. కుమారస్వామి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఫోన్ ట్యాపరింగ్ కు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మద్దతు ఇవ్వడంతో కథ కొత్త మలుపు తిరిగింది.

 అవునా ? నాకు తెలీదు

అవునా ? నాకు తెలీదు

ఫోన్ ట్యాపరింగ్ విషయంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్య మాట్లాడుతూ ఈ విషయం తనకు ఏమాత్రం తెలీదని అన్నారు. ఫోన్ ట్యాపరింగ్ చేశారు అనే విషయంలో తనకు ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదని సిద్దరామయ్య చెప్పారు. ఫోన్ ట్యాపరింగ్ విషయంలో ప్రభుత్వం విచారణ జరిపించాలని, ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభవించాలని మాజీ సీఎం సిద్దరామయ్య అన్నారు.

 కాంగ్రెస్ లీడర్స్ సీరియస్

కాంగ్రెస్ లీడర్స్ సీరియస్

ఫోన్ ట్యాపరింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి మల్లికార్జున్ ఖార్గే మండిపడుతున్నారు. ఫోన్ ట్యాపరింగ్ చెయ్యడం చట్టపరంగా పెద్ద నేరం, ఈ విషయంపై లోతుగా విచారణ జరగాలని మల్లికార్జున్ ఖార్గే అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఫోన్ ట్యాపరింగ్ కు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

సీఎం యడియూరప్ప ప్లాన్

సీఎం యడియూరప్ప ప్లాన్

ఫోన్ ట్యాపరింగ్ వ్యవహారం సీరియస్ గా తీసుకోవాలని బీజేపీ నాయకులు అంటున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ఢిల్లీ నుంచి వచ్చిన తరువాత మంత్రివర్గం ఏర్పాటు చేస్తారు. మంత్రివర్గం ఏర్పాటు చేసిన తరువాత ఫోన్ ట్యాపరింగ్ వ్యవహారంపై ప్రత్యేక టీంతో దర్యాప్తు చేయించాలని సీఎం యడియూరప్ప నిర్ణయించారని తెలిసింది.

కుమారస్వామి, ఐపీఎస్ అధికారులు

కుమారస్వామి, ఐపీఎస్ అధికారులు

ఫోన్ ట్యాపరింగ్ వ్యవహారంపై లోతుగా విచారణ జరిపించి మాజీ సీఎం కుమారస్వామి, ఆయన కుటుంబ సభ్యులకు సరైన సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప నిర్ణయించారని సమాచారం. ఫోన్ ట్యాపరింగ్ చేశారని మాజీ సీఎం కుమారస్వామితో పాటు అనేక మంది ఐపీఎస్ అధికారుల మీద ఆరోపణలు వచ్చాయి. కొందరు ఐపీఎస్ అధికారుల సహకారంతోనే మాజీ సీఎం కుమారస్వామి అనర్హత ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాపరింగ్ చేశారని ఆరోపణలు వచ్చాయి.

English summary
Congress leaders are deeply upset with HD Kumaraswamy for taping their telephone. Yediyurappa shows lot of interest in this case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X