వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భూమి లాక్కొన్నారు, పూలన్ దేవి తల్లికి కష్టాలే, తిండి కోసమిలా...

బందిపోటు రాణి పూలన్ దేవి కుటుంబం తీవ్రంగా ఇబ్బందులు పడుతోంది. 70 ఏళ్ళ వయస్సున్న పూలన్ దేవి తల్లి మూల దేవి కి ఉపాధి హమీ పనులే తిండిని పెడుతున్నాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో:పూలన్ దేవి...ఈ పేరు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఒకప్పుడు మార్మోగిపోయింది. చంబల్ లోయ ప్రాంతాన్ని స్థావరంగా చేసుకొని పూలన్ దేవి గడగడలాడించింది పూలన్ దేవి .పోలీసులకు లొంగిపోయిన తర్వాత రెండు దఫాలు ఎంపిగా కూడ పనిచేసింది.అయితే ప్రత్యర్థుల కాల్పుల్లో ఆమె మరణించింది.ఇంత చరిత్ర ఉన్న పూలన్ దేవి తల్లి, సోదరి ప్రస్తుతం తినడానికి గింజలు లేక అష్టకష్టాలు పడుతున్నారు.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని చంబల్ లోయ ప్రాంతాన్ని పూలన్ దేవి స్థావరంగా చేసుకొని భూస్వాములకు ముచ్చెమటలు పోయించారు. ఆమె పేరు చెబితేనే భూస్వాములు వణికిపోయేవారు.

1980 దశకంలో ఆమెను పట్టుకోవాలంటే పోలీసులు కూడ భయపడేవారు. అయితే ఆమె తనకు తానుగానే లొంగిపోయింది. ఆమె బతికున్న రోజుల్లో ఆ కుటుంబం పట్ల ప్రజలు భయభక్తులతో ఉండేవారు. కాని, ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి.

కూతురు బతికున్న రోజుల్లో పూలన్ దేవి మూల దేవికి ఇబ్బంది లేకుండా పోయింది. అయితే పూలన్ మరణించిన తర్వాత కనీసం కడుపు నింపుకోవడం కోసం మూలదేవి, ఆమె మరో కూతురు ఉపాధి పని కోసం వెళ్తున్నారు.

ఉపాధి హమీ పనులే మూల దేవికి తిండి పెడుతున్నాయి

ఉపాధి హమీ పనులే మూల దేవికి తిండి పెడుతున్నాయి

1980 దశకంలో చంబల్ లోయ ప్రాంతాన్ని స్తావరంగా చేసుకొన్న పూలన్ దేవి భూస్వాములకు చుక్కలు చూపించారు. ఆమెను అరెస్టు చేసేందుకు ప్రయత్నించేందుకు పోలీసులకు కూడ ప్రయత్నించేవారు కాదు. పోలీసులు కూడ భయపడేవారు. అయితే ప్రస్తుతం పూలన్ దేవి తల్లి మూల దేవి తిండి కోసం అల్లాడుతోంది. 70 ఏళ్ళ వయస్సులో ఉన్న మూల దేవికి తిండి పెడుతోంది ఉపాధి హమీ పనులే. పూలన్ దేవి సోదరి ఉపాధిహమీ పనిచేసి వచ్చిన డబ్బులతోనే మూల దేవి తిండి తినాల్సి వస్తోంది.మూలదేవి చిన్న కూతురు రామ్ కలీ ఉపాధి హమీ పనులకు వెళ్ళి తెచ్చిన డబ్బులతోనే వారికి పూట గడుస్తోంది.నెలకు రూ.440 కంటే ఎక్కువ మొత్తాన్ని వారు సంపాదించడం లేదు.

వంగి వంగి దండాలు పెట్టి...ఇప్పుడిలా

వంగి వంగి దండాలు పెట్టి...ఇప్పుడిలా

పూలన్ దేవి బందిపోటుగా చంబల్ లోయ ప్రాంతాన్ని ఏలుతున్న సమయంలో పూలన్ దేవి తల్లి ఇంటి నుండి బయటకు వస్తే ప్రజలు ఆమెకు వంగి వంగి దండాలు పెట్టేవారు. అంతేకాదు ఆమెను చూసేందుకు కూడ పెద్ద సంఖ్యలో వచ్చేవారు. కానీ, ఇప్పడు మాత్రం ఆమె కేవలం వాటిని గుర్తు చేసుకొంటూ మూలదేవి జీవిస్తున్నారు.బందిపోటుగా పూలన్ దేవి ఉన్న కాలంలో ఎంత డబ్బును కూడబెట్టిందనో అనుకోనేవారికి ప్రస్తుతం ఆమె తల్లిని చూస్తే తెలుస్తోంది వారి కుటుంబం పరిస్థితి.

పావుకిలో ఉల్లిపాయలు, గోధుమపిండి

పావుకిలో ఉల్లిపాయలు, గోధుమపిండి

గత ఏడాది కరువు ప్రాంతాలపై సర్వే నిర్వహించేందుకు ఓ స్వచ్చంద సంస్థ ఈ ప్రాంతంలో సర్వే నిర్వహించింది.అయితే ఆ సమయంలో పూలన్ దేవి సోదరి రామ్ కలీ, ఆమె తల్లి మూల దేవి ఈ సంస్థ ప్రతినిధులకు కన్పించారు.ఈ సంస్థ ప్రతినిధులు పూలన్ దేవి ఇంటికి వెళ్ళిన సమయంలో కొద్దిపాటి గోధుమ పిండి, పావుకిలో ఉల్లిపాయలు మినహ ఆ ఇంట్లో ఏమీ లేవు. రెండు దఫాలు పూలన్ దేవి సమాజ్ వాదీ పార్టీ ఎంపిగా పనిచేశారు. కానీ, మూలదేవి కుటుంబ పరిస్థితిని చూసి ఆ సంస్థ ప్రతినిధులు ఆశ్చర్యపోయారు.

ఎన్నికల సమయంలో నాయకుల హమీలు

ఎన్నికల సమయంలో నాయకుల హమీలు

ఎన్నికల సమయంలో పలు రాజకీయపార్టీల నాయకులు తమ వద్దకు వస్తారని వాళ్ళు తనను స్టేజీమీద చూపిస్తారని పూలన్ దేవి సోదరి రామ్ కలీ చెప్పారు. స్టేజీ మీద తనను తీసుకెళ్ళి చూపించినందుకు రూ.200 ఇస్తారని ఆమె చెప్పారు.అయితే ప్రత్యర్థుల నుండి బెదిరింపులు వస్తుండడంతో రాజకీయ నాయకుల మాటలు విని స్టేజీలు ఎక్కడం కూడ మానేశానని ఆమె చెప్పారు. ఎన్నికల సమయంలో వచ్చిన నాయకులు తమను ఆదుకొంటామని హమీలు ఇస్తారని కాని ఎన్నికలయ్యాకే వాటిని మర్చిపోయారని ఆయన చెప్పారు.

ములాయం .ప్రభుత్వం పూలన్ పై కేసుల ఎత్తివేత

ములాయం .ప్రభుత్వం పూలన్ పై కేసుల ఎత్తివేత

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ములాయం సింగ్ యాదవ్ ఉన్న కాలంలోనే పూలన్ దేవి లొంగిపోయింది. పూలన్ దేవిపై ఉన్న కేసులన్నింటిని ములాయం సింగ్ ప్రభుత్వం ఎత్తివేసింది. 1983 లో ఆమె పోలీసులకు లొంగిపోయింది. ఆమె లొంగిపోయే సమయానికి ఆమెపై 48 కేసులున్నాయి. వాటన్నింటిని ములాయం ప్రభుత్వం ఎత్తివేసింది.

ఎంపిగా రెండు దఫాలు

ఎంపిగా రెండు దఫాలు

1994 లో ఆమె జైలు నుండి విడుదలైంది. రెండేళ్ళ తర్వాత ఆమె మీర్జాపూర్ నుండి ఎంపిగా పోటీ చేసి విజయం సాధించారు. 1999 లో మరోసారి కూడ ఆమె ఎంపిగా పోటీ చేసి విజయం సాధించారు. 2001 జూలై 25వ, తేదిన ఆమె తన నివాసం వద్దే ప్రత్యర్థుల కాల్పుల్లో మరణించారు. పూలన్ దేవి మరణించిన తర్వాత ఆమె కుటుంబం తీవ్రంగా కష్టాలపాలైంది.

భూమిని లాక్కోన్న భూస్వాములు

భూమిని లాక్కోన్న భూస్వాములు

పూలన్ దేవి మరణించిన తర్వాత భూస్వామ్యులు పూలన్ దేవి కుటుంబానికి చెందిన భూమిని లాక్కొన్నారని మూల దేవి చెప్పారు. పూలన్ దేవి మరణించిన తర్వాత తమ కుటుంబానికి కష్టాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. తన చిన్న కూతురికి సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ టిక్కెట్టు ఇస్తానని హమీ ఇచ్చాడని, కానీ ఎందుకో వెనకడుగు వేశాడని మూలాదేవి చెప్పారు.

English summary
Mula Devi hasn't met anyone wearing "suit-boot" in years. And when the visitor gives the 70-year-old Rs 200 after she says she hasn't eaten properly in days, her eyes well up. She quietly shuffles inside her hut, which is bandaged into standing up with bits of cloth and plastic, puts the money in a tin box and sends a prayer heavenwards.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X