స్విగ్గీ బ్యాగ్ తో నడిచి వెళ్తున్న మహిళ ఫోటో ఆమె జీవితాన్నే మార్చేసిందిగా!!
మాటల్లో చెప్పలేని అనేక విషయాలను ఫోటోలు స్పష్టంగా చెప్తాయి. అనేక సమస్యలను తెలియజేసే ఫోటోలు అందరినీ ఆలోచించేలా చేస్తాయి. ఇక తాజాగా బుర్కా ధరించిన ఒక మహిళ స్విగ్గి బ్యాగ్ తో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఫోటో ఆమె జీవితాన్ని మార్చేసింది. ఇంతకీ ఆ మహిళ ఎవరు? అసలు ఆమె కథ కమామీషు ఏమిటి అంటే..

బుర్ఖా ధరించి స్విగ్గీ బ్యాగ్ తో ముస్లిం మహిళ ఫోటో.. సోషల్ మీడియాలో వైరల్
బుర్కా ధరించి.. వెనుక స్విగ్గి బ్యాగ్ తగిలించుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఒక ముస్లిం మహిళకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫోటో అప్లోడ్ అయిన కొన్ని గంటల్లోనే వైరల్ గా మారిన ఈ ఫోటో ముస్లిం కమ్యూనిటీలో మూస పద్ధతులను విచ్చినం చేయడానికి సాహసం చేస్తున్న ఒక మహిళగా ఆమెను ప్రశంసించడం ప్రారంభించారు. అయితే ఆ ఫోటో వెనకనుంచి తీయబడి ఉన్న కారణంగా సదరు మహిళ ఎవరు?ఏమిటి అన్నది గుర్తించలేకపోయారు.

స్విగ్గి ఫుడ్ డెలివరీ ఏజెంట్ కాదు కానీ ఆమె జీవితం ఇదే
అయితే ఫైనల్ గా ఆ మహిళ 40 సంవత్సరాల రిజ్వానా అని, ఆమె స్విగ్గి ఫుడ్ డెలివరీ ఏజెంట్ కాదని తేలింది. ఆమె ఇళ్లల్లో పని చేసుకునే పని మనిషిగా తన గురించి తాను చెప్పుకుంది. ఉదయం, సాయంత్రం ఇళ్లల్లో పని చేస్తూ 1500 రూపాయలు సంపాదించుకునే తాను, మధ్యాహ్నం సమయంలో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉంటానని, డిస్పోజల్ గ్లాసులు, దుస్తులు విక్రయిస్తానని వెల్లడించింది. ఆ ఆదాయంతో తాను తన జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నానని రిజ్వానా పేర్కొంది.

స్విగ్గీ అవకాశం ఇస్తే పని చేస్తానన్న ముస్లిం మహిళ
నలుగురు పిల్లల తల్లి అయిన రిజ్వాన లక్నోలోని జనతా నగర్ కాలనీలో ఒకే గదిలో నివసిస్తుంది. 23ఏళ్ల క్రితం భర్త ఆమెను వదిలి వెళ్ళిపోయాడు. దాంతో ఆమె అప్పటి నుంచి తన జీవితాన్ని ఇళ్లల్లో పని చేసుకుంటూ కొనసాగిస్తున్నానని పేర్కొంది. ప్రతిరోజు దాదాపు 20 నుండి 25 కిలోమీటర్ల మేర నడిచి తాను తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్టు వెల్లడించింది. అయితే తాను తన బిజినెస్ కోసం 50 రూపాయలకు ఈ బ్యాగ్ కొనుగోలు చేశానని పేర్కొంది. తాను స్విగ్గి కోసం పనిచేయడం లేదని, ఒకవేళ అవకాశం ఇస్తే పనిచేస్తానని పేర్కొంది.

రిజ్వానా కథ విని సాయం అందిస్తున్న పలువురు..
అయితే ఇందులో సమస్య ఏమిటంటే తన వద్ద ఎటువంటి రవాణా సౌకర్యాలు లేవని ఆమె వెల్లడించింది. రిజ్వాన పరిస్థితి తెలుసుకునే చాలామంది ఆమెకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఆమె బ్యాంక్ ఎకౌంట్ డీటెయిల్స్ తెలుసుకొని రిజ్వానాకు ఆర్థికంగా మద్దతు ఇస్తున్నారు. మొత్తానికి రిజ్వానా ను వెనక నుండి తీసిన ఒక ఫోటో ప్రస్తుతం ఆమె జీవితాన్నే మార్చేసింది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications