కాలువ దాటేందుకు పోలీస్ మీద ఎక్కిన ఎమ్మెల్యే

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి చెందిన ఓ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అధికార దుర్వినయోగానికి పాల్పడ్డాడు. ఓ చిన్న కాలువను దాటేందుకు వ్యక్తిగత భద్రతాధికారి (పిఎస్ఓ)పై ఎక్కాడు. అతనిపై ఎక్కని ఎమ్మెల్యే ఆ కాలువను దాటాడు.

కాగా, ఈ తతంగాన్ని ఫొటోలు తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ ఎమ్మెల్యేగారి అధికార దుర్వినియోగం వెలుగులోకి వచ్చింది. అయితే ప్రభుత్వం ఆ వ్యక్తిగత భద్రతాధికారిని తనకు సహాయం చేసేందుకు కేటాయించిందని ఎమ్మెల్యే చెబుతున్నారు.

Photo of policeman carrying BJP MLA on back goes viral

‘ఇది అధికార దుర్వినియోగం కాదు. పిఎస్ఓను నాకు సహాయంగా ఉండేందుకే నియమించింది. చిన్న కాలువను దాటేందుకు అతను నాకు సాయం చేశాడు. ఇందులో తప్పేముంది' అని ఆ ఎమ్మెల్యే కిషన్ లాల్ చెప్పారు.

ఛాంబ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆ ఎమ్మెల్యేను కాలువ దాటేందుకు సదరు అధికారి తనపై ఎక్కించుకుని దాటించారు. పిఎస్ఓ, తాను ఒకరికొకరం సహాయం చేసుకుంటామని ఎమ్మెల్యే చెప్పారు. అతడు తనకు స్వచ్ఛందంగా సహాయం చేశాడని, అతడు బానిస కాదని అన్నారు.

తామిద్దరం ప్రజలకు సేవకులమని ఆ ఎమ్మెల్యే తెలిపారు. ఈ ప్రాంతంలోని ప్రజలకు కొన్ని సంవత్సరాల నుంచి తాను వైద్యుడిగా సేవలందిస్తున్నట్లు చెప్పారు. గతంలో ఆ ఎమ్మెల్యే కాలువను స్వయంగా దాటేవారు. అయితే ఎమ్మెల్యే అయిన తర్వాత పిఎస్ఓను ప్రభుత్వం కేటాయించడంతో అతని సహాయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+