HMPV: చైనా వైరస్ దెబ్బకు లాక్ డౌన్ తప్పదా ? కేంద్రం క్లారిటీ ఇదే....
చైనా వైరస్ హెచ్ఎంపీవీ ప్రభావం భారత్ లో కనిపిస్తోంది. ఇప్పటికే బెంగళూరులో రెండు, ఆహ్మదాబాద్ లో ఓ కేసు నమోదయ్యాయి. చైనా వైరస్ లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరిన చిన్నారుల నుంచి సేకరించిన శాంపిల్స్ ను ల్యాబ్స్ కు పంపి పరీక్షలు చేస్తున్నారు. వైరస్ వ్యాప్తిని ఐసీఎంఆర్ అనుక్షణం అంచనా వేస్తూ కేంద్రానికి తగు సూచనలు చేస్తోంది. దీంతో కేంద్రం కూడా రాష్ట్రాల్ని అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.
ఇలాంటి సమయంలో చైనా వైరస్ మరింత విజృంభించే అవకాశం ఉందని, దీంతో కేంద్రం గతంలో విధించినట్లుగా మరోసారి లాక్ డౌన్ విధిస్తుందన్న చర్చ జోరుగా సాగుతోంది. చైనాలో వైరస్ ప్రభావానికి సంబంధించిన పలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. దీంతో భారత్ లోనూ ఒక్కసారిగా ఈ వైరస్ విరుచుకుపడే ప్రమాదం ఉందని, దీంతో కేంద్రం కూడా లాక్ డౌన్ కు మొగ్గు చూపుతుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇవాళ కేంద్ర ప్రభుత్వ సంస్ధ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) వివరణ ఇచ్చింది.

దేశవ్యాప్తంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సైతం 'లాక్డౌన్' పేరుతో థంబ్నెయిల్స్ పెట్టి అసత్యపు ప్రచారం చేస్తుండటంతో కేంద్రానికి చెందిన PIB FACTCHECK స్పందించింది. ఇలాంటివి నమ్మి ఆందోళన చెందొద్దని, కేంద్రం అలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది. ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడే వరకూ ఏదీ నమ్మొద్దని తెలిపింది. దీంతో హెచ్ఎంపీవీ వైరస్ ప్రభావం ఉన్నప్పటికీ లాక్ డౌన్ దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదని తెలుస్తోంది. కాబట్టి ఇకపై ఇలాంటి ప్రచారాలకు చెక్ పడుతుందో లేదో చూడాలి.
HMPV के मामलों के बाद लॉकडाउन की खबरों से भ्रमित तो नहीं हो गए❓
— PIB Fact Check (@PIBFactCheck) January 9, 2025
📣"NewsStateTV" नामक #Youtube चैनल अपने वीडियो थंबनेल के जरिए देश में लॉकडाउन लगने जैसी सनसनी खबरों के माध्यम से डर फैलाने की कोशिश कर रहा है #PIBFactCheck
⚠️घबराएँ नहीं, भारत सरकार ने ऐसी कोई घोषणा नहीं की है pic.twitter.com/t0oTKzbn2f
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications