వైయస్ జగన్ కోరాడు, దీదీ సరేనన్నారు (పిక్చర్స్)

కోల్‌కతా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టడంలో భాగంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ బుధవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు అధ్యక్షురాలు మమతా బెనర్డీని కలిశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకించాలని జగన్ చేసిన విజ్ఞప్తికి దీదీ సరేనన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ మాట్లాడారు.

భేటీ తర్వాత ఇరువురు కలిసి మీడియా సమావేశంలో కూడా మాట్లాడారు. మమతా బెనర్డీ మొదటి నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ మళ్లీ తెర మీదికి వస్తుందనే ఆందోళనతోనే ఆమె తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్నట్లు భావిస్తున్నారు. అందువల్ల జగన్ విజ్ఞప్తిని అంగీకరించే విషయంలో ఆమెకు పెద్దగా ఇబ్బందులు రాలేదు.

కాగా, తాను బిజెపి, కాంగ్రెసులకు వ్యతిరేకంగా జాతీయ స్థాయి ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలని మమతా బెనర్జీ కసరత్తు ప్రారంభించారు. ఈ విషయంపై తీవ్రంగా ఆలోచన చేస్తున్న సమయంలో మమతా బెనర్జీ జగన్ తల్లి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మకు పోన్ చేసి తమతో జత కట్టాలని కోరారు. అప్పుడు జగన్ ఏ విషయమూ చెప్పలేదు. బుధవారం జరిగిన సమావేశంలో ఆ విషయంపై కూడా చర్చ జరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు.

మమతా బెనర్జీతో జగన్ ఇలా..

మమతా బెనర్జీతో జగన్ ఇలా..

కోల్‌కతాలో వైయస్ జగన్ మమతా బెనర్జీని కలిసి, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తాము చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని కోరారు.

మీడియా భేటీలో జగన్..

మీడియా భేటీలో జగన్..

రాష్ట్రాన్ని విభజించడానికి వీలు లేదని, విభజన తీర్మానాన్ని కచ్చితంగా శాసనసభకు పంపించాలని వైయస్ జగన్ మమతా సమక్షంలో కోరారు.

మమతా మాటల ఈటెలు..

మమతా మాటల ఈటెలు..

జగన్ తన తమ్ముడిలాంటివాడని దీదీ అన్నారు. రాష్ట్రాన్ని విభజించడానికి వీలు లేదని ఆమె అన్నారు. ఇరు ప్రాంతాల అభిప్రాయాలు తీసుకోవాలని ఆమె కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.

జగన్‌తో పాటు ప్రతినిధులు..

జగన్‌తో పాటు ప్రతినిధులు..

జగన్‌తో పాటు పార్టీ నాయకులు కొణతాల రామకృష్ణ, మేకపాటి రాజమోహన్ రెడ్డి తదితరులు మమతా బెనర్జీని కలిశారు.

ఇలా చూశాడు..

ఇలా చూశాడు..

మమతా బెనర్జీ తనకు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో జగన్ ఇలా చూశారు. జాతీయ స్థాయిలో ఫ్రంట్ ఏర్పాటుపై వారి మధ్య చర్చలు ఏమైనా జరిగాయా చూడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+