పెద్దనోట్ల రద్దు ప్రకటనకు ముందు మోడీ తన మంత్రులను ఇంట్లో పెట్టి తాళం వేశారు: రాహుల్

పెద్ద నోట్ల రద్దు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించకముందు అతని కేబినెట్ మంత్రులను తన ఇంట్లో పెట్టి తాళం వేశాడని నిప్పులు చెరిగారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ప్రధాని ఇంటి వద్ద ఉన్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ వారే స్వయంగా తనతో ఈ విషయం చెప్పినట్లు రాహుల్ గాంధీ తెలిపారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రసంగిస్తూ రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు

బాలాకోట్ దాడులను స్వలాభం కోసం వినియోగించుకుంటున్న వ్యక్తి మోడీ అని ధ్వజమెత్తారు. మోడీ తన సొంత ప్రపంచంలో జీవిస్తున్నాడని రాహుల్ గాంధీ విమర్శించారు. ఇండియన్ఎయిర్ ఫోర్స్‌ను మేఘాల చాటున ఉండాల్సిందిగా మోడీ చెప్పారని అతనికి ఎంత తెలివి ఉందో ఇక్కడే అర్థమవుతోందని రాహుల్ ఎద్దేవా చేశారు. ఈ మధ్య ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ మాట్లాడుతూ బాలాకోట్ దాడులకు మేఘాలు సహకరించాయని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలను రాహుల్ గాంధీ ప్రస్తావించారు.

PM locked his ministers in a room during note ban anouncement:Rahul

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే న్యాయ్ పథకాన్ని అమలు చేసి దేశంలో పేదరికాన్ని నిర్మూలిస్తామని చెప్పారు. హామీ ఇచ్చిన ఇతర సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తామని చెప్పారు. ఈ ఐదేళ్లు బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలను మోసం చేస్తూ వచ్చిందని ధ్వజమెత్తారు. సమయాన్ని వృథా చేసిందని అన్నారు. ఇదిలా ఉంటే మే 19న హిమాచల్ ప్రదేశ్‌లోని 4 పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+