'బీజేపీ ఎంపీ,ఎమ్మెల్యేలు బ్యాంకు ఖాతాల వివరాలు అందించాల్సిందే'

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ : ప్రధాని మోడీ మరో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలంతా తమ బ్యాంకు ఖాతా వివరాలను వెల్లడించాలని ఆదేశాలు జారీ చేశారు. నవంబర్ 8వ తేదీ.. అంటే నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన నాటి నుంచి డిసెంబర్ 31వ వరకు తమ బ్యాంకు లావాదేవీల వివరాలను పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు సమర్పించాల్సిందిగా ఆదేశించారు.

ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు బీజేపీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు కూడా బ్యాంకు ఖాతాల వివరాలు వెల్లడించాలని తెలిపారు. నోట్ల రద్దు నిర్ణయంపై విపక్షాల నుంచి వ్యతిరేకత పెరుగుతున్న తరుణంలో.. పారదర్శకంగా వ్యవహరించేందుకే మోడీ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. బీజేపీ నేతలకు నోట్ల రద్దు గురించి ముందే తెలుసునన్న ఆరోపణలకు చెక్ పెట్టడంతో పాటు మరియు సొంత పార్టీ నేతల విషయంలోను కఠినంగా వ్యవహరిస్తున్నామనే సంకేతాలు పంపిచడానికే మోడీ ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని భావిస్తున్నారు.

PM Modi asks all BJP MPs, MLAs to submit bank account details to track transactions from Nov 8

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Prime Minister Modi has asked all his BJP MPs, MLAs to submit details of their bank account transactions between November 8 and December 31 to counter Opposition charges that the party was aware of the move.
Please Wait while comments are loading...