రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆరో రోజుకు చేరుకున్న వేళ.. రాష్ట్రపతితో ప్రధాని మోడీ కీలక భేటీ

వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతోన్న యుద్ధం ఆరో రోజుకు చేరుకుంది. మరింత భీకర రూపాన్ని దాల్చింది. రష్యా సైనిక బలగాలు- ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను సమీపిస్తోన్నాయి. ఉక్రెయిన్ సైనికుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్నప్పటికీ.. వాటన్నింటినీ అధిగమించింది. కీవ్‌కు 40 కిలోమీటర్ల దూరానికి చేరుకుంది. దీనికి సంబంధించిన శాటిలైట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రష్యా సైనికుల దూకుడును ప్రస్ఫూటింపజేస్తోన్నాయి.

మానవత దృక్పథంతో భారత్..

మానవత దృక్పథంతో భారత్..

ఈ యుద్ధాన్ని నివారించడానికి ఏకంగా ఐక్యరాజ్య సమితి రంగంలోకి దిగింది. అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఈ అత్యున్నత వేదిక మీదుగా ఉక్రెయిన్, రష్యా రాయబారులు తమ వాదనలు, డిమాండ్లను వినిపించారు. సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెర్రస్ తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. రెండు దేశాలు సంయమనం పాటించాలని సూచించారు. ఇదే భేటీలో భారత్.. తన వైఖరిని స్పష్టం చేసింది. ఉక్రెయిన్ పట్ల తాము మానవతా దృక్పథంతో వ్యవహరిస్తామని పేర్కొన్నారు.

పొరుగు దేశాలకు థ్యాంక్స్..

పొరుగు దేశాలకు థ్యాంక్స్..

మెడిసిన్ వంటి అత్యవసర వస్తువులను తక్షణమే సరఫరా చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని తేల్చి చెప్పారు. ఉక్రెయిన్‌లో తమ దేశ పౌరుల తరలింపును ముమ్మరం చేశామని, దీనికోసం నలుగురు కేంద్రమంత్రులను తమ ప్రభుత్వం ప్రత్యేక రాయబారులుగా నియమించిందని తిరుమూర్తి చెప్పారు. ఈ సంక్షోభ సమయంలో ఉక్రెయిన్ పొరుగు దేశాలన్నీ భారత్‌కు అండగా నిలిచాయని, తమ దేశ విద్యార్థులు, పౌరులను తరలించడానికి అనుకూల పరిస్థితులను కల్పించాయని అన్నారు.

రాష్ట్రపతి దృష్టికి..

రాష్ట్రపతి దృష్టికి..

ఈ పరిణామాల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఉదయం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ అయ్యారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, భారత విద్యార్థులు, పౌరుల తరలింపు కోసం ఇప్పటిదాకా తీసుకున్న చర్యల గురించి వివరించారు. ఇక ముందు ఎలాంటి వ్యూహాలను అనుసరించాల్సి ఉంటుందనే విషయాన్నీ ఆయన దృష్టికి తీసుకెళ్లారు. భారతీయుల తరలింపుపై ప్రస్తుతం దృష్టి సారించామని, ఇప్పటిదాకా పలువురిని స్వదేశానికి తీసుకొచ్చామని అన్నారు. ఇంకా వేలాదిమందిని తీసుకుని రావాల్సి ఉందని చెప్పారు.

ప్రత్యేక రాయబారులుగా..

ప్రత్యేక రాయబారులుగా..

ఉక్రెయిన్ నుంచి భారత విద్యార్థులు, సాధారణ పౌరులు రోడ్డు మార్గంలో రొమేనియా, పోలెండ్, స్లొవేకియా, హంగేరీ సరిహద్దులకు చేరుకుంటున్నారని, అక్కడి ఆయా దేశాల గుండా భారత్‌కు వస్తున్నారని ప్రధాని.. రాష్ట్రపతికి వివరించారు. దీనికోసం ప్రత్యేక విమానాలను నడిపిస్తున్నామని చెప్పారు. ఎయిరిండియా ప్రత్యేక విమానాలను నడిపిస్తోందని అన్నారు. కొన్ని ప్రైవేటు విమానయాన సంస్థలు కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యాయని పేర్కొన్నారు.

Recommended Video

    Russia Ukraine Conflict : Ukraine Rejects US Offer | Volodymyr Zelenskyy | Oneindia Telugu
    నలుగురు కేంద్రమంత్రులు..

    నలుగురు కేంద్రమంత్రులు..

    ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలతో సమన్వయం చేసుకోవడానికి కేంద్రమంత్రులు హర్దీప్ సింగ్ పురి, జ్యోతిరాదిత్య సింధియా, కిరణ్ రిజిజు, వీకే సింగ్‌‌లను ప్రత్యేకంగా నియమించామని, వారంతా ఉక్రెయిన్ పొరుగు దేశాలకు వెళ్లి తరలింపు చర్యలను పర్యవేక్షిస్తారని అన్నారు. కాగా- ఉక్రెయిన్‌కు అందజేయాల్సిన సహాయ కార్యక్రమాలు, మెడిసిన్ వంటి అత్యవసర వస్తువులను ఈ సాయంత్రంలోగా భారత్‌ నుంచి పంపిస్తామని పేర్కొన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+