వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపు పీఎం మోడీ బెంగాల్ పర్యటన రద్దు .. కరోనా పరిస్థితిపై సమీక్షలతో ప్రధాని బిజీ

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభణ నేపధ్యంలో పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సభలో తాను పాల్గొనబోనని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. శుక్రవారం పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ర్యాలీలలో ప్రసంగించబోనని, బదులుగా దేశంలో కరోనావైరస్ వ్యాధి (కోవిడ్ -19) తీవ్రతరం కావడంపై ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశాలకు అధ్యక్షత వహిస్తానని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ట్వీట్ చేశారు.

ఆ మృతదేహాన్ని తరలించేందుకు రూ.60వేలు డిమాండ్ చేసిన అంబులెన్స్ డ్రైవర్ఆ మృతదేహాన్ని తరలించేందుకు రూ.60వేలు డిమాండ్ చేసిన అంబులెన్స్ డ్రైవర్

రేపు, ప్రస్తుత కోవిడ్ -19 పరిస్థితిని సమీక్షించడానికి ఉన్నత స్థాయి సమావేశాలకు అధ్యక్షత వహించనున్నాను . ఆ కారణంగా నేను పశ్చిమ బెంగాల్‌కు వెళ్ళను "అని ప్రధాని మోదీ గురువారం సాయంత్రం ట్వీట్ చేశారు. మరోపక్క ఈరోజు ఆక్సిజన్ సరఫరాపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోడీ . ఆక్సిజన్ సరఫరా, ఉత్పత్తి తదితర అంశాలపై కేంద్ర రాష్ట్ర ఉన్నతాధికారులతో చర్చించిన మోడీ ఆక్సిజన్ అక్రమ నిల్వలపై రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని సూచించారు .చాలా రాష్ట్రాల నుంచి ప్రాణవాయువు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

 PM Modi cancels Bengal visit on Friday, to hold review meetings on Covid-19

గత 24 గంటల్లో భారతదేశం 3 , 14,835 కొత్త కేసులను నమోదు చేసిందని, మహమ్మారి కారణంగా 2,104 ఒకే రోజు మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (మోహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ) వెల్లడించింది . ఇక విపరీతంగా పెరుగుతున్న కరోనా కేసులు నేపథ్యంలో, కరోనా మహమ్మారి కట్టడి చేయడానికి రంగంలోకి దిగిన ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నతస్థాయి సమావేశాలతో బిజీగా ఉన్నారు. అందులో భాగంగానే రేపు పశ్చిమబెంగాల్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రధాని నరేంద్ర మోడీ రద్దు చేసుకున్నారు.

English summary
Prime Minister Narendra Modi tweeted on Thursday he will not address poll rallies in West Bengal on Friday, and will instead chair high-level meetings in Delhi over the worsening situation of the coronavirus disease (Covid-19) in the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X