Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వేగంగా యువతకు వ్యాక్సినేషన్.. వారికి వర్క్ ఫ్రం హోం: మోడీ

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ కూడా ఎక్కువే వ్యాపిస్తోంది. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం సమీక్ష నిర్వహించారు. కరోనా నేపథ్యంలో వర్చువల్‌గా జరిగిన సమావేశంలో హోం శాఖ మంత్రి అమిత్ షా, వైద్యరోగ్య శాఖ మంత్రి మాన్సుక్ మాండవియ, ఏవియేషన్ సెక్రటరీ, హోం సెక్రటరీ, క్యాబినెట్ సెక్రటరీ, రైల్వే బోర్డు చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.

యువతకు వ్యాక్సినేషన్ గురించి డిస్కష్ చేశారు. వారికి వీలైనంత త్వరగా టీకాల కార్యక్రమం పూర్తి చేయాలని కోరారు. అలాగే దివ్యాంగులు, గర్బిణీలకు వర్క్ ప్రం హోం అవకాశం కల్పించారు. కరోనా ఎక్కువగా ఉన్న ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లను గుర్తించి.. అధికారులకు కూడా వర్క్ ఫ్రం హోం ఇచ్చారు. కంటైన్మెంట్ జోన్ ఎత్తివేశాకే ఆఫీసుకు రావాలని స్పస్టంచేశారు. డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి గురించి సమావేశంలో చర్చించారు. గత 24 గంటల్లో లక్ష 59 వేల కరోనా కేసులు వచ్చాయి. ఇదీ గత 224 రోజులలో ఎక్కువ మొత్తం.. యాక్టివ్ కేసులు కూడా 197 రోజుల్లో ఎక్కువగా రికార్డయ్యాయి. 5.90 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో గతేడాది మే 29వ తేదీ లక్ష 65 వేల కరోనా కేసులు వచ్చిన సంగతి తెలిసిందే.

 PM Modi chairs Covid review meeting, Union Home, Health ministers attend

5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలయిన సంగతి తెలిసిందే. కరోనా కేసుల నేపథ్యంలో ర్యాలీలు, సభలకు ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వలేదు. జనవరి 15వ తేదీ తర్వాత పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని తెలియజేసింది. దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కేవలం పది రోజుల వ్యవధిలోనే కేసుల సంఖ్య 10 వేల నుంచి లక్షన్నరకు పైగా నమోదయ్యాయి. ఒమిక్రాన్ కేసులు సైతం రోజురోజుకు పెరుగుతున్నాయి.

కరోనా తోపాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అలజడి రేపుతోంది. దేశంలోని 27 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశంలో 3,623 కేసులు నమోదయ్యాయి. ఇక ఒమిక్రాన్ వేరియంట్ వలన ప్రాణాపాయం చాలా తక్కువని, మైల్డ్ సింటమ్స్ మాత్రమే ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు.కరోనా కేసులు భారీగా వస్తున్నాయి. ఈ నెల ఆఖరు.. ఫిబ్రవరిలో భారీగా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రముఖులను కూడా కేసులు వదలడం లేదు. హెల్త్ వర్కర్లు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు కరోనా సోకుతుంది.

ఇటు కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అందుకు తగిన జాగ్రత్తలను తీసుకుంటుంది. ఆస్పత్రుల్లో అన్ని రకాల సౌకర్యాలు, మందులు అందుబాటులో ఉంచాలని అధికారులకు స్పష్టంచేసింది. కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పింది. ఒమిక్రాన్ వైరస్ వాయువేగంతో వ్యాపిస్తోంది. ఒకరికి సోకితే.. ఆ ఫ్యామిలీకి దాదాపుగా వస్తోంది. సన్నిహితంగా మెలిగితే చాలు వైరస్ వస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+